ఏదైనా సాధించాలనుకుంటే.. వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఈ 94ఏళ్ల బామ్మ. సాధారణంగా పురుషులకైనా.. మహిళలకైనా 60 ఏళ్లు పైబడితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇక 90 సంవత్సరాల గలవారైతే.. వారి శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లి.. నిలబడలేక, కూర్చోలేక ఏ వస్తువునూ పట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం ‘వయసు సంఖ్య మాత్రమే’ అని అంటోంది. 94 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈ విజయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.
ఫిన్లాండ్ వేదికగా జూన్ 29 నుంచి జులై 10వరకు జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఔట్డోర్ ఛాంపియన్‌షిప్-2022 ఘనంగా ముగిశాయి. భగ్వానీ దేవి అనే 94 ఏళ్ల మహిళ ఈ ఛాంపియన్‌షిప్ లో బంగారు పతకాన్ని గెలుచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన 100 మీటర్ల పరుగులో 24.74 సెకన్ల సమయంలో చేరుకుని భగవానీ దేవి మొదటి స్థానంలో నిలిచి… బంగారు పతకాన్ని గెలుచుకుంది. అంతే కాక షాట్ ఫుట్ లో కాస్యం పతాకం సాధించింది. గతంలో చెన్నైలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భగవానీ దేవీ మూడు బంగారు పతకాలను సొంతం చేసుకుంది. దీంతో ఫిన్లాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు భారతదేశం తరపున ఆమె అర్హత సాధించింది.
దేశంలోని అనేక మంది ప్రముఖల నుంచి ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి. “బలమైన మరియు స్ఫూర్తిదాయకమైన మహిళ” అంటూ భగవానీ దేవి నటి కంగనా రనౌత్ నటి సోషల్ మీడియాలో ద్వారా ప్రశంసించింది. ఈమెకు పారా అథ్లెట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత వికాస్ దాగర్ మనవడు అవుతాడు. మరి..94 ఏళ్ల భామ భారదేశానికి బంగారు పతాకం తెచ్చిపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
94-year-old Bhagwani Devi Dagar won a gold and 2 bronze for India at the World Masters Athletics championships 2022 in Finland, yesterday pic.twitter.com/JRPZrBDSAK
— ANI (@ANI) July 11, 2022
हमारी दादी माए भी किसी से कम हैं क्या !🙏🏻#jaiho जय हो 🇮🇳 pic.twitter.com/sW0DPjUYIM
— Aman Preet IRS 🇮🇳 (@IrsAman) July 7, 2022