దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అది కూడా టెస్టు సిరీస్‌లో గెలిచిన జట్టుపై ఓటమి చవిచూసింది. మరి చివరి వన్డేతో పాటు, సిరీస్ ఓటమికి గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. భారత గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-2తో ఓడిన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్‌ను మాత్రం 2-1తో కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని చివరి రెండు వన్డేలో అద్భుత విజయాలు సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలో గెలుపు దిశగా సాగిన భారత్.. ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు కోల్పోవడంతో ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండానే 269 పరుగులు చేసింది. బదులుగా టీమిండియా 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి గల కారణాలను పరిశీలిద్దాం..
1. బ్యాటింగ్ వైఫల్యం
ఈ మ్యాచ్‌లోనే కాదు ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా బ్యాటింగ్ చాలా ఫేలవంగా ఉంది. తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఆడిన ఇన్నింగ్స్‌లు తప్పించి ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇలా అంతా దారుణంగా ఫ్లాప్ అయ్యారు. కోహ్లీ చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించినా.. విజయానికి ఆ ఇన్నింగ్స్ సరిపోలేదు.
2. బౌలింగ్ లోపాలు
టీమిండియా బౌలింగ్ ప్రదర్శన బ్యాటింగ్ కంటే బాగానే ఉన్నా.. ఆరంభంలో వికెట్లు తీసి చివరి వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. ప్రత్యర్థి జట్టుకు రావాల్సిన పరుగుల కంటే అదనంగా పరుగులు వస్తున్నాయి. చివరి వన్డేలో కూడా 203 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెయిలెండర్ వికెట్లతోనే 269 పరుగులకు చేరింది. టెయిలెండర్లు 66 పరుగులు జోడించడం ఆస్ట్రేలియాకు ఎంతో కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది కేవలం 21 పరుగుల తేడాతోనే. పులి తలను కొట్టేస్తున మన బౌలర్లు తోకను మాత్రం వెంటనే కత్తిరించలేకపోతున్నారు. ఆ అదనపు పరుగులు ఛేజింగ్‌లో భారంగా మారుతున్నాయి.
3. సూర్యకుమార్ యాదవ్
ఈ సిరీస్‌లో టీమిండియాకు పెద్ద మైనస్ ఏంటంటే.. సూర్యకుమార్ యాదవ్. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యను వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడించాలనే ఉద్దేశంతో అతనికి వన్డేల్లో అవకాశం ఇస్తున్నారు. అయితే.. అది సిరీస్ మొత్తంపై తీవ్ర ప్రభావం చూపింది. మిడిల్దార్‌లో సూర్యలాంటి ప్లేయర్ పరుగులేమి చేయకుండా డకౌట్లు అవ్వడం బ్యాటిండ్ ఆర్డర్‌ను బలహీన పర్చింది. నిజం చెప్పాలంటే.. ఈ సిరీస్‌లో టీమిండియా 10 మంది బ్యాటర్లతోనే ఆడిందనే చెప్పాలి. ఎందుకంటే సూర్య ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయలేదు.
4. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ
ఇక ఈ సిరీస్‌లో టీమిండియా వైఫల్యం కంటే కూడా ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. రైట్ టైమ్‌లో బౌలింగ్ మార్పులు, అద్భుతమైన ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లతో టీమిండియా దారుణంగా దెబ్బతీశాడు. పక్కా వ్యూహంతో ఏ బ్యాటర్‌కు ఎలాంటి బౌలింగ్ వేయించాలి, ఎలాంటి ఫీల్డింగ్ పెట్టాలనే విషయాల్లో ఆరితేరిన స్మిత్.. తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని మొత్తం అద్భుతంగా ప్రదర్శించాడు. బ్యాటర్‌గా ఈ సిరీస్‌లో విఫలమైనా.. ఒక కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ సైతం.. స్మిత్ కెప్టెన్సీని మెచ్చుకున్నాడంటేనే తెలుస్తుంది. ఈ సిరీస్‌లో స్మిత్ కెప్టెన్సీ ఎంత ప్రభావం చూపిందో.
5. టాపార్డర్ దారుణ వైఫల్యం
టీమిండియాలో ఓటముల్లో చాలా కాలంగా ప్రధాణ పాత్ర పోషిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది టాపార్డర్ బ్యాటింగ్ అనే చెప్పాలి. టీమిండియా గెలిచిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ తొలి టెస్టులో చేసిన సెంచరీ మినహా పెద్దగా టాపార్డర్ చేసిందేం లేదు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌తోనే టీమిండియా అద్భుతాలు చేసింది. ఇక వన్డేల్లో కూడా గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా లోయర్ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్, జడేజా గెలిపించారు. టీమిండియాకు మొదటి మూడు స్థానాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. చివరి మ్యాచ్‌లో కోహ్లీ రాణించినా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ ఆడలేదు. అతని స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ నిరాశ పరిచాడు. ఇక గిల్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇలా టీమిండియాకు టాపార్డర్ సమస్య పెను భారంగా మారుతోంది. ఇదే పరిస్థితి ఒకసాగితే.. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవు. మరి టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia came close to the target but it’s Australia who won the third and final ODI by 21 runs.#INDvAUS | @mastercardindia pic.twitter.com/1gmougMb0T
— BCCI (@BCCI) March 22, 2023