ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే అన్న విషయం మనందరికి తెలిసిందే. ప్రతి అభ్యర్థి గెలవాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ అధిష్టానం. అలానే తనపై నమ్మకం పెట్టుకున్న అధిష్టానంపై ఓ వైసీపీ ఎమ్మెల్యే విధేయత చాటుకున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటు ఎంతో విలువైనది. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తుంటుంది. అలానే ప్రజాప్రతినిధులు కూడా ఓటుకు ఉన్న పవర్, విలువ ఎంతటిదో ప్రజలకు తరచూ చెప్తుంటారు. అంతేకాక కొందరు ప్రజాప్రతినిధులు విభిన్న పరిస్థితులో ఉండి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే భారీగా ఖర్చుతో వచ్చి మరి..తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆ ఎమ్మెల్యే పార్టీపై తన విధేయతను చాటుకున్నారు. ఇంతకి ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ స్టోరీ ఏమిటి ఇప్పుడు చూద్దాం…
ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. నిత్యం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి ఈ పొలిటికల్ వార్ పుల్ హీటెక్కింది. మూడు పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఊపు మీద ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని భావించింది. ఇదే సమయంలో తాము నిలబెట్టిని ప్రతి అభ్యర్థి గెలవాలనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొంది వైసీపీ అధిష్టానం.
ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేసింది. ప్రతి ఎమ్మెల్యే ఓటింగ్ లో పాల్గొనేలా.. అలానే ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వెయ్యాలి అనే విషయాలపై పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది. ఎమ్మెల్సీ ఓటింగ్ సమయంలో విదేశీయ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే లందరూ ముందుగానే వచ్చేశారు. అయితే ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రత్యేక చాపర్ లో వచ్చి.. ఓటు వేసి మరి.. తన విధేయతను చాటుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు వివాహం ఎన్నికల రోజు జరుగుతుంది. ఎమ్మెల్యే అప్పలనాయుడు కుమారుడు, వైసీసీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కుమార్తెతో జరిగింది.
ఈ పెళ్లి ముహూర్తం నాలుగు నెలల క్రితమే నిశ్చయించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఆఖరి క్షణంలో అప్పలనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుమారుడి వివాహం కారణంగా అప్పలనాయుడు ఆలస్యంగా వచ్చి ఓటు వేశారు. వైసీపీ అధిష్టానం ఆయన కోసం ప్రత్యేక చాఫర్ ను ఏర్పాటు చేసింది. ఆ ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి గన్నవరం ఎయిపోర్టుకు వచ్చి..అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అసెంబ్లీలోని ఓటింగ్ హాల్ కి వెళ్లి.. వైసీపీ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరిగ్గా పెళ్లి రోజే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు.
సీఎంతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ పెళ్లికి హాజరు కాలేని పరిస్థితి. అంతేకాక ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో అప్పలనాయుడు సైతం ఓటింగ్ రావాలని అధిష్టానం ఆదేశించింది. పెళ్లి కుమారుడి తండ్రిగా వివాహ క్రతువులు పాటించాల్సిన సంప్రదాయాలు ఒక్క పక్కన అయితే.. ఓటింగ్ లో పాల్గొనాల్సి రావడం మరో పక్క అనివార్యమైంది. పెళ్లి జరుగుతుండగానే సంప్రదాయాలను తనను నమ్మిన పార్టీకి పై విధేయత చాటుకున్నారు. ఇన్ని మజిలీలు నడుమ అప్పలనాయుడు ఓటు అత్యంత విలువైనదిగా మారడం కొసమెరుపు.