ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండేళ్లుగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు 150కి పైగా పిటిషన్లు వేయగా.. వాటిని 57కు కుదించి విచారణ సాగిస్తున్నారు. 3 రాజధానులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. హైకోర్టులో 3 రాజధానులపై రోజువారీ విచారణ జరుగుతోంది. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. అప్పటివరకు 3 రాజధానులు కావాల్సిందే అని పట్టుబట్టిన జగన్ సర్కార్ ఎందుకు వెనక్కు తగ్గింది అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిలో కొందరు చంద్రబాబు కన్నీరుపెట్టుకున్న ఇష్యూ పక్కదారి పట్టించడానికే ఇదంతా అంటూ కామెంట్ చేస్తున్నారు.
చంద్రబాబు ఇష్యూ సైడ్ చేయడానికే!
3 రాజధానుల ఉపసంహరణను ఇంత సడెన్ గా ఎందుకు చేశారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయిు. అందుకు సమాధానంగా.. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పైకి చెప్తున్నా.. అంతర్గతంగా ఏదో ఉందనేది కొందరి భావన. టెక్నికల్ గా ఇబ్బందులు రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మార్పులు చేసి కొత్త బిల్లు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇది ప్రణాళిక ప్రకారం తీసుకున్న నిర్ణయం అయి ఉంటే తదుపరి కార్యాచరణ గురించి ఒక అవగాహన ఉండేది. ఏపీలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటన పెద్ద దుమారమే రేపింది. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మొదలు కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఎందరో స్పందించారు. దేశవ్యాప్తంగా అటెన్ష్ క్యారీ అయ్యింది. ఏపీ ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో పడేసిన ఘటన అది. అసెంబ్లీ సాక్షిగా నా భార్యను తిడతారా అన్న చంద్రబాబు ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం కనిపించలేదు. కుటుంబం ప్రస్తావన రాలేదని చెబుతున్నా.. అది బుకాయింపులాగే కనిపించింది. అది చినికి చినికి గాలివాన కాక ముందే పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కన్నీటిపర్వాన్ని పక్కదారి పట్టించడానికే ఈ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.