ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం సరికొత్త వ్యూహరచనతో పొలిటికల్ గేమ్ ని కీలక మలుపు తిప్పారు. గతంతో పోలిస్తే ఈసారి పవన్ కి పొలిటికల్ మైలేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కి మద్దతుగా కాపు నాయకులు అందరూ ఏకం కావాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశాఖలో కాపుల సమావేశానికి ముందు విజయవాడలో గంటా శ్రీనివాసరావు నివాసంలో.. బోండా ఉమ, ఎడం బాలాజీ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి కన్నా లక్ష్మీ నారాయణ హాజరవ్వడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
అయితే రాజకీయ భేటీ కాదని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అయినప్పటికీ ఈ భేటీపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంగవీటి రంగ 26వ వర్ధంతి సందర్భంగా విశాఖలో కాపు నేతలంతా సమావేశమవుతున్నారు. ఈ సమావేశం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాపులకు రాజ్యాధికారం తీసుకొచ్చే దిశగా కార్యాచరణ రూపొందించడమే ఈ సమావేశం యొక్క ప్రథమ లక్ష్యం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఏపీలో కాపులంతా జనసేన పార్టీ కోసం ఒక తాటిపైకి వస్తారా? ఏపీలో కాపుల సీక్రెట్ ఆపరేషన్ నడుస్తుందా? కాపు నేతలంతా సీక్రెట్ గా పవన్ కి మద్దతు ఇస్తారా? అనే అంశాలపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు సుమన్ టీవీ చేసిన డిబేట్ లో స్పష్టత ఇచ్చారు. వీడియో చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.