తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ఇటీవల హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నరేంద్రమోడీని దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారని అన్నారు. కానీ ఇది మరకకుండా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రధానికి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని తెలిపారు. అంతెందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రులతో పాటు ఎంతో ఘనంగా స్వాగతం పలికారని, జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలంటూ ధర్మేంద్ర ప్రదాన్ సూచించారు.
ఇక విషయం ఏంటంటే? రెండు మూడు రోజుల కిందట హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అయితే దానికంటే ముందు ఎయిర్ పోర్టులో ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లకుండా తెలంగాణ పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోడీకి స్వాగతం పలికారు. దీంతో రాష్ట్ర సీఎం రాకుండా మంత్రిని పంపడం ప్రధానిని అవమానపరిచినట్టేనని బీజేపీ నేతలు భావించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు ప్రధాని ఏపీకి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: YSR District: భర్తను చేసుకున్నందుకు ఏనాడు సుఖం దక్కలేదు.. అలా చేయొద్దంటూ మొత్తుకున్నా వినకుండా!
దీంతో ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు గవర్నర్ తో పాటు ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. భీమవరం జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గని ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. అనంతరం సభావేదికపై కూడా ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఏపీ మంత్రులు ఇచ్చారు. ఈ అంశంపైనే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కేసీఆర్ పై ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.