తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ఇక్కడి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైస్ షర్మిల. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో పార్టీ స్థాపించబోతున్నాని బాంబ్ పేల్చారు. అన్నట్టుగానే ఇటీవల పార్టీ జెండా, ఎజెండాలను కూడా ప్రకటించారు. హైద్రాబాద్ లో కొంత మంది పార్టీ నేతలు, అభిమానుల మధ్య షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించారు. దీంతో పాటు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు వైస్ షర్మిల.
ప్రస్తుతం తెలంగాణలో అన్ని సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఇక అధికార తెరాస ప్రభుత్వంపై సమయమొచ్చినప్పుడల్లా తన గొంతును విప్పింతుంది. ఇక తెలంగాణలో అన్ని జిల్లాల పార్టీ నాయకులతో వరుసగ సమావేశం అవుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తోంది వైస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉద్యోగం లేక చనిపోయిన కుటుంబాలను సైతం పరామర్శించింది రాజన్న కూతురు.
ఇక షర్మిల రాష్ట్రంలోని విద్యా, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో దూసుకుపోతుంది. నేడు హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో పాల్గొన్న షర్మిల అధికార ప్రభుత్వంపై విరుచుకుపడింది. దీంతో పాటుగా తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదాలపై కూడా స్పందించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విభేదాలపై స్పందిస్తూ..పుట్టింటి వాళ్ళతో అలిగినా, విభేదాలు వచ్చినా..ఫుట్టింటికి వెళ్లారని తెలిపింది. ఇక మా అన్నతో విభేదాలు వస్తే మాట్లాడకుండా ఉంటా కానీ.. ఇలా పార్టీలు పెట్టానని తెలిపింది. ఇక ఈ రాజకీయ పార్టీ ఎవరి మీద అలిగి పెట్టింది కాదని, ప్రజా సమస్యల కోసమే పురుడు పోసుకుందని తెలిపింది.
తెలంగాణలో మళ్లీ రాజన్నరాజ్యాన్ని తీసుకురావటానికి ఈ పార్టీని స్థాపించామని తెలిపింది షర్మిల. దీంతో పాటు ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నచ్చకపోవటం వల్లే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇక బోర్డు మీటింగ్ లకు పిలిస్తే వెళ్ళకపోవడం వల్లే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని షర్మిల తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి చుక్కను వదులుకోమని తెలిపింది. అలాగని పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన నీటిని కూడా అడ్డుకోబోమని అన్నారు. ఇక తెలంగాణలోని అన్ని సమస్యలపై పోరాడేందుకు ఢిల్లీకి అయినా వెళ్తామని తేల్చి చెప్పారు వైస్ షర్మిల.