పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు అందరికీ ముద్దొస్తారు. కానీ ఆ పిల్లలు ఏ వయసులో ఉన్న ముద్దొచ్చేది ఒక్క తల్లిందండ్రులకి మాత్రమే. పిల్లలకు పెళ్ళిళ్ళై, పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు తల్లిదండ్రులకి పిల్లలే, తల్లిదండ్రుల ముందు చిన్న పిల్లలే. అలాంటి పిల్లలకి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు వచ్చినా, ఆ పిల్లలు ఏదైనా ఘనత సాధించినా ఆ ఆనంద క్షణాలని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం అనేది సెలబ్రిటీలకు స్టేటస్ తో పెట్టిన విద్య. తాజాగా వైసీపీ మంత్రి రోజా.. తన కూతురు అన్షు మాలిక పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. భౌతికంగా జనంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రోజమ్మ.. పండుగలకి సంబంధించిన పోస్టులు, ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించిన పోస్టులు పెడుతూ అలరిస్తుంటారు.
ఈ క్రమంలోనే ఇవాళ (సెప్టెంబర్ 10) తన కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ ను అభిమానులతో పంచుకున్నారు. అన్షు మాలిక ప్రస్తుత ఫోటోలతో పాటు చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ.. “డియర్ అన్షు.. నువ్వు కేవలం నా కూతురివి మాత్రమే కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ వి కూడా. నన్ను అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్” అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చారు. రోజా అలా రాయడానికి ఒక కారణం ఉంది. ఆమె ఒక పక్క షూటింగ్స్ లో.. మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు. ఈ బిజీ షెడ్యూల్ లో ఇంట్లో తన పిల్లల గురించి ఆలోచించే సమయం గానీ, తీరిక గాని ఉండదు.
ఈ విషయాన్ని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తల్లి తమతో సమయం గడపడం లేదని పిల్లలు తనపై కోపం తెచ్చుకోరట. తనని అర్ధం చేసుకుని సపోర్ట్ చేస్తారట. అందుకే అమ్మని అర్ధం చేసుకున్న పిల్లల్ని.. తన స్నేహితులుగా భావించారు రోజా. స్నేహితుల కంటే అర్ధం చేసుకునే గొప్ప వ్యక్తులు ఇంకెక్కడ ఉంటారు. అందుకే తన కూతుర్ని స్నేహితురాలితో పోల్చారు రోజా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి రోజా షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.