RK Roja: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రకటనతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. అధికార, విపక్ష పార్టీల్లోని నాయకులు ఒకరిపై ఒకరు ఈ విషయంపై విమర్శలు చేసుకుంటున్నారు. పేరు మార్పుపై సీఎం వైఎస్ జగన్‌పై బాలయ్య చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కొద్దిరోజుల క్రితం కౌంటర్ ఇచ్చారు. ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘ బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే..!!’’ అని పేర్కొన్నారు. తాజాగా, ఆమె మరోసారి చంద్రబాబుపై, సీనియర్ ఎన్టీఆర్ కుటుంసభ్యులపై విమర్శలు గుప్పించారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ సీనియర్ ఎన్టీఆర్ బతికున్నపుడు కుటుంబసభ్యులు ఆయన్ని బాగా చూసుకుని అన్నం పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్టీఆర్‌ను ఇంటి అల్లుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నపుడు.. బాబుని కుటుంబసభ్యులు మెడపట్టి ఇంటి బయటకు గెంటి ఉంటే బాగుండేది. ఈ రోజు ఎన్టీఆర్ దేశ ప్రధాని అయి ఉండేవాడు. బతికుండగానే ఎన్టీఆర్‌ను చంపేసిన బాబుకు, ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు. రాజధాని విషయంలో కోర్టులో గెలిచామని రాజధాని రైతులు సంతోషపడుతున్నారు.
అయినా కూడా రాజధానులు మూడు ఉంటాయి. పాలన వైజాగ్ నుంచి జరుగుతుంది. అది గుర్తించకుండా కొందరు తొడలు కొడుతున్నారు. అసలు ఆ పార్టీలో ఆడవాళ్లు తొడలు కొడతారు.. మగవాళ్లు ఏడుస్తారు. జంబలకడిపంబ లాగా పార్టీ తయారైంది’’ అని రోజా ఎద్దేవా చేశారు. ఇక, సోమవారం చంద్రబాబు నాయుడుపై రోజా ఓ ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్‌లో .. ‘‘ వయసు 73. అనుభవం 45. సీఎంగా 14. కుప్పంలో ఓటు లేదు. ఇల్లు కూడా లేదు. ఆయన పేరు చెపితే గుర్తుకు వచ్చే స్కీము లేదు! వాటే పిటీ బాబూ…?’’ అని పేర్కొన్నారు.
బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం 🦁
తేడా వస్తే దబిడి దిబిడే..!!— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2022
ఇవి కూడా చదవండి : వర్సిటీకి NTR పేరు మార్చడంపై ఎట్టకేలకు స్పందించిన లక్ష్మీపార్వతి!