వైసీపీ ని సరికొత్త లీకులు భయపెడుతున్నాయి. ఇవన్నీ కూడా రాసలీలల ఆడియో లీకులు కావడం విశేషం. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు మీద ఇలానే ఓ ఆడియో వైరల్ అయిన విషయం తెలిసందే. దీని మీద ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పుడు తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కి కూడా ఇలాంటి తలనొప్పులు మొదలయ్యాయి. అవంతి శ్రీనివాస్ పేరు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది.
ఈ ఆడియో అంతటా ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉండటం విశేషం. నెటిజన్స్ మాత్రం ఈ విషయంలో భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్‌దేనంటూ కొంత మంది ప్రచారం చేస్తుండగా, మరికొంత మంది మాత్రం ఇది వైసీపీ నాయకులను టార్గెట్ చేసి చేస్తున్న కుట్ర అని కొట్టి పారేస్తున్నారు.
ఈ ఆడియోపై మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా స్పందించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయవ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. ఈ విషయంలో నిజాలేంటో తేల్చాలని CP తోపాటు, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాను అని ఆయన స్పష్టం చేశారు. మరి.., ఈ ఆడియో లీక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.