కోనసీమ జిల్లా పేరు మార్పుతో మొదలైన వివాదం.. ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం.. సహనం కోల్పోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాక.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టడం, ప్రభుత్వ బస్‌ని తగలబెట్టడం వంటి సంఘటనలతో హింసాకాండ చెలరేగింది. ఇక ఈ విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన పార్టీ హస్తముందని వైఎస్సార్‌సీపీ అంటుంటే.. కాదు అధికార పార్టీనే ఈ విధ్వంసం వెనక ఉంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య మాటల యుద్ధ నడుస్తోంది. ఇదిలా కొనసాగుతుండగానే.. విధ్వంసానికి కారకుడిగా అన్యం సాయి అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది.. అమలాపురంలో జరిగిన అల్లర్ల వెనుక ఇతడి హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయి వైఎస్సార్‌సీపీ కార్యకర్త అని కొన్ని ఫోటోలు వైరల్ అవుతుండగా.. వైఎస్సార్‌సీపీ మాత్రం అతడు జనసేన పార్టీ కార్యకర్త అంటూ కొన్ని ఫోటోలను బయటపెట్టింది. వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అతడు జనసేన కార్యకర్త అని ఆరోపణలు చేశారు.
అన్యం సాయిపై సజ్జల చేసిన ఆరోపణలకు జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘మాతో ఫోటోలు తీయించుకున్న ఇలాంటి వెధవలని మీ YCP పార్టీలో చేర్చుకొని ఇలాంటి విధ్వంసకరమైన పనులు చేయిస్తున్న మిమ్మల్ని, మీ పార్టీని ఏమనాలి సజ్జల?. Hello Mr.సజ్జల, మరి ఇటీవలే ఆ వెధవ మీతో దిగిన ఈ ఫోటోలకు మీరు ఏమని సమాధానం చెబుతారు. కొంచెం సంకుచిత ధోరణి విడనాడి విశాల దృక్పథంతో పనిచేయండి. కులాల మధ్యన చిచ్చులు పెట్టే నీచపు రాజకీయాలు ఇకనైనా మానుకోండి. అమలాపురం ప్రజలందరిని నా విన్నపం.. మీరందరూ దయచేసి సంయమనం పాటించి ఇలాంటి వైసీపీ కుట్రలకు మీరు బలి కావొద్దని నా విజ్ఞప్తి’ అంటూ ట్వీట్ చేశారు.
మాతో ఫోటోలు తీయించుకున్న ఇలాంటి వెధవలని మీ YCPపార్టీలో చేర్చుకొని ఇలాంటి విధ్వంసకరమైన పనులు చేపయిస్తున్న మిమ్మల్ని, మీ పార్టీని ఏమనాలి సజ్జల ???
Hello Mr.సజ్జల,
మరి ఇటీవలే ఆ వెధవ మీతో దిగిన ఈ ఫోటోలకు మీరు ఎమని సమాధానం చెబుతారు ! pic.twitter.com/L68gm4X3Xp— Naga Babu Konidela (@NagaBabuOffl) May 25, 2022
ఇది కూడా చదవండి: నిహారికను టార్గెట్ చేసిన వారిని కుక్కలతో పోల్చిన నాగబాబు!
మంగళవారం అమలాపురంలో విధ్వంసం వెనుక అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారట. అందుకే అతడ్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సాయిని పోలీసులు ప్రశ్నిస్తున్నారట.. గతంలోనే అతడిపై రౌడీషీట్ కూడా ఉందంటున్నారు. ఈ సాయి విషయంలోనే నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సాయి వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ సజ్జలతో దిగిన ఫోటోను వైరల్ చేస్తున్నారు. అలాగే మంత్రి విశ్వరూప్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బయటకు వచ్చాయి. మరి ఈ రెండింటిలో ఏది నిజమో తెలియాల్సి ఉంది. నాగబాబు కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nagababu: పవన్ కంటే జగన్ రేంజ్ ఎక్కువని ఒప్పుకున్న నాగబాబు!