ప్రస్తుతం నిరుద్యోగులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. ఇంగ్లీష్‌లో మాట్లాడే సామర్థ్యం లేకపోవడం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పటికి కూడా.. ఇంగ్లీష్‌లో సరైన ప్రావీణ్యం లేకపోవడం చేత ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కనీసం భవిష్యత్తు తరాలైన ఈ సమస్యను ఎదుర్కొకుండా ఉండాలనే ఉద్దేశంతో.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలోని బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సీఎం జగన్‌తో సమావేశం అయిన సందర్భంగా.. స్పష్టమైన ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. చిన్నారులపై పలువురు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో.. ఈ ఏడాది చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈ ఏడాది పదో తరగతి రిజల్ట్స్‌లో ఫెయిల్ అయిన వారి సంఖ్య భారీగా ఉంది. ఈ క్రమంలో విపక్షాలు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి.. విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి కారణం అయ్యింది అంటూ విమర్శించడం ప్రారంభించారు. అంతేకాక సీఎం జగన్ దగ్గర ఇంగ్లీష్‌లో అదరగొట్టిన బెండపూడి స్కూల్‌లో కూడా పదో తరగతి ఉత్తీర్ణత కేవలం 57 శాతంగా ఉందంటూ ప్రచారాన్ని మొదలు పెట్టారు. దీంతో విపక్షాలు, నెటిజనులు.. సోషల్ మీడియా వేదికగా.. నాడు సీంఎ జగన్‌తో భేటీ అయిన విద్యార్థులను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఇదీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగరా.. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు!
ఇంగ్లీష్‌లో అదరగొట్టిన పాఠశాలలో కేవలం 57 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారంటూ దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు. పేదల పిల్లలు ఇంగ్లీషలో మాట్లాడితే పాపమా?.. కనీసం మానవత్వం కూడా లేకుండా చిన్నారులను ట్రోల్ చేస్తారా.. మీకు దమ్ము ధైర్యం ఉంటే.. ప్రభుత్వాన్ని ఢీకొట్టండి కానీ.. అమాయకులైన చిన్నారులను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మేఘన చేసిన తప్పేంటి.. మంచి ఇంగ్లీష్‌లో మాట్లడటమా?, మంచి మార్కులతో పాస్ కావడమా?.. అని ప్రశ్నించారు. స్టార్స్ పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడితే ట్రోల్ చేయరు.. పేదవాళ్ల పిల్లల మీదనా మీ ప్రతాపం.. వారిని విమర్శిస్తే.. అడిగేవాళ్లు లేరని ఇలా చేస్తున్నారా అంటూ ఘాటుగా విమర్శించారు.
దమ్ము ధైర్యం ఉంటే మాతో పోరాడండి. pic.twitter.com/edN3fPCjst
— Kodali Nani (@IamKodaliNani) June 8, 2022
ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన పది రోజులకే యువతి మృతి! అసలు ఏమైందటే..
ఇక బెండపూడి విద్యార్థులను ట్రోల్ చేసిన వారిలో చాయ్ బిస్కట్ కంపెనీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక కొడాలి నాని హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులను ట్రోల్ చేసిన వారు అలర్ట్ అయ్యారు. చాయ్ బిస్కట్ కంపెనీ.. సదరు ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసినట్లు ఓ పోస్ట్ కూడా చేయడం విశేషం. ఇక కొడాలి నాని ఎంట్రీతో మిగతా వారు కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మరి.. రాజకీయ అవసరాల కోసం విద్యార్థులను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్న వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Chai Bisket (@ChaiBisket) June 8, 2022