హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఒవైసీకి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పస్తూ.. ప్రకటన చేసింది. కానీ ఒవైసీ మాత్రం తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని.. తాను స్వేచ్ఛగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులకు బీజేపీతో సంబంధం ఉందని వెల్లడి కావడంతో ఒవైసీ విమర్శల దాడిని ముమ్మరం చేశారు. కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం నాడు పార్లమెంటులో ప్రకటన చేశారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి సెక్యూరిటీ వద్దంటే ఎలా అని ఒవైసీని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి : ఎంపీ అసద్ పై కాల్పులు.. సీరియస్ గా స్పందించిన కేటీఆర్
ఇదిలా ఉంటే, కాల్పుల ఘటనలో ఒవైసీ ప్రాణాలతో బయటపడిన క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంఐఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి ఒవైసీ పేరు మీద ఏకంగా 101 మేకలను బలిచ్చాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాకుత్ పురా పరిధిలోని బాగ్ ఎ జహానారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అసదుద్దీన్ అభిమాని. ఎంఐఎం పార్టీకి ఆర్థికంగానూ సహకారం అందిస్తుంటాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల వార్త విని కంగారుపడ్డాడు.
ఇది కూడా చదవండి : జెడ్ క్యాటగిరీ నాకొద్దు.. న్యాయం కావాలి: అసదుద్దీన్ ఓవైసీ
తన అభిమాన నాయకుడు ప్రాణాలతో బయయటపడటంతో అల్లాకు దువా చెల్లించుకోవాలనుకున్నాడు. ప్రత్యేక ప్రార్థనల్లో భాగంగా ఆదివారం ఉదయం 101 మేకలను బలి ఇచ్చాడు ఆ వ్యాపారి. ఈ కార్యక్రమానికి మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం హాజరయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలోనే భారీ విందు ఏర్పాటు చేశాడు. ఒవైసీ కోసం ఓల్డ్ సిటీ వ్యాపారి 101 మేకల్ని బలిచ్చిన వార్త వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి.