SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Bjp Mla Etela Rajender Comments On Cm Kcr About 2018 Elections Conspiracy

Etela Rajender: KCR ను ఓడించకపోతే ఈ జన్మకు సార్థకత లేదు: ఈటల

  • Written By: Dharani
  • Published Date - Wed - 27 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Etela Rajender: KCR ను ఓడించకపోతే ఈ జన్మకు సార్థకత లేదు: ఈటల

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ దూకుడు పెంచారు. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ను టార్గెట్‌ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తాను అని ప్రకటించిన ఈటల.. మరోసారి మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించకపోతే.. ఈ జన్మకు సార్థకత లేదన్నారు. అంతేకాక 2018 ఎన్నికల్లోనే కేసీఆర్‌ తనను ఓడించడానికి ప్రయత్నించడాని ఈటల సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ బొమ్మతో తాను ఎన్నికల్లో గెలవలేదని స్పష్టం చేశారు. పదవుల కోసం తాను తెలంగాణ ఉద్యమంలో చేరలేదన్నారు. తన సొంత పనితీరుతోనే ఎన్నికల్లో గెలిచానన్నారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్‌ కుట్రలు చేశారని ఆరోపించారు. మంత్రిగా ఉన్న తన ఇంట్లోనే ఎన్నికలప్పుడు తనిఖీలు చేయించారన్నారు. తనతో పాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ నేతల ఓటమికి కేసీఆర్ కుట్ర చేశారన్నారు. వారు ముగ్గురు ఓడిపోతే.. తాను మాత్రమే గెలిచానని ఈటల తెలిపారు.

సవాల్ చేసిన వ్యక్తి రాజీనామా చేయలేదు..
హుజూరాబాద్‌లో తాను గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఇప్పటికీ రాజీనామా చేయలేదని ఈటల ఎద్దెవా చేశారు. సొంతగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్‌ సహించరని ఆరోపించారు. తాను గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని సవాల్ విసిరానని, కేసీఆర్‌కు దమ్ముంటే హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసి గెలవాలని తన సవాల్‌ అన్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తా అని సవాల్ విసిరితే బానిసలతో తిట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు.

etala rajendar

టచ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
టీఆర్‌ఎస్‌, కాంగ్రె‌స్‌కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ నెల 27 తర్వాత బీజేపీలో చేరికలు మొదలవుతాయన్నారు. టీఆర్‌ఎస్‌లోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరూ తనతో టచ్‌లో ఉన్నారని ఈటల అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టిన ఘనత ప్రధాని మోదీకి చెందుతుందన్నారు.

etala rajendar

ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. కేసీఆర్‌ అహంకారాన్ని తాను కాస్త ముందుగా ఎదిరించానని, అదే బాటలో చాలా మంది నడుస్తారన్నారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని ఈటల అన్నారు. ప్రస్తుతం బీజేపీ నేత వ్యాఖ్యలు రాజకీయ హీట్‌ పెంచాయి. మరి ఈటల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: Etala Rajender: దమ్ముంటే అసెంబ్లీని రద్దు చెయ్.. కేసీఆర్ కు ఈటల సవాల్!
  • ఇది కూడా చదవండి: Eetala Rajendar: గజ్వేల్‌ లో కేసీఆర్‌ పై ఈటల పోటీ.. బెంగాల్‌ సీన్‌ రిపీట్‌ చేస్తానంటూ!

Tags :

  • Assembly ElectionS
  • etela rajender
  • K Chandrashekar Rao
  • latest telugu news
  • political news
  • trs
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్టు విడుదల.. ఆ స్థానాల్లో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్టు విడుదల.. ఆ స్థానాల్లో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్

  • టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

    టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

  • పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

    పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

  • రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

    రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

  • పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

    పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam