గతంలో టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీ మారీ అదే పార్టీకి ప్రధాన శత్రువుగా మారిపోయారు. టీఆర్ఎస్ పార్టీ భూ కబ్జాల ఆరోపణలతో ఈటలను పార్టీ నుంచి బయటకు పంపిన విషయం తెలిసిందే. దీంతో అనంతరం మారిన రాజకీయ పరిణామాల మధ్య ఈటల రాజేందర్ కమలం గూటికి చేరి రాజీనామా చేసిన చోటే గెలిచి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో అప్పటి నుంచి ఈటలకు, కేసీఆర్ కు అస్సలు పడడం […]
మాజీ మంత్రి, హుజురాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించితేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం, పోడు భూముల రైతుల సమస్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ […]
తెలంగాణలో గత కొంత కాలంగా అధికార, ప్రతి పక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యతో తెలంగాణ అగ్గి రాజుకుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల గొడవలయ్యాయి. మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా […]