హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. హిందూపురం పర్యటనలో భాగంగా భారీగా అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలను, అభిమానులను పలకరిస్తున్న బాలకృష్ణ ఒక్కసారిగా వాహనం కదలడంతో వెనక్కి పడిపోయారు. ప్రచార వాహనం పైన నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణ కార్యకర్తలకు చేతులతో నమస్కారం పెడుతున్నారు. అయితే ప్రచార వాహనం ఒక్కసారిగా ముందుకు కదలడంతో బాలకృష్ణ ఒక్కసారిగా వెనక్కి కూలబడ్డారు. వెంటనే అప్రత్తమైన నేతలు టీడీపీ ఆయన్ని పట్టుకున్నారు. దీంతో బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. బాలకృష్ణ పడిపోవడంతో అభిమానులు, కార్యకర్తలు కంగారు పడ్డారు.
ఇక బాలకృష్ణ.. అక్కినేని వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు గారు తనకు బాబాయ్ లాంటి వారని.. ఆయన మీద ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుందని అన్నారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళని.. ఏఎన్నార్ తన పిల్లల కంటే ఎక్కువగా తనను ప్రేమించేవారని అన్నారు. ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటే.. ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు పడిపోకుండా ఉండడాన్ని నేర్చుకున్నానని అన్నారు. పొరపాటున ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని అన్నారు. హిందూపురంలో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత హిందూపురం నుంచి తిరిగి వస్తుండగా బాలయ్యకు ప్రమాదం తప్పింది. తమ అభిమాన హీరో, అభిమాన నాయకుడికి ప్రమాదం తప్పడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BREAKING: హిందూపురంలో ప్రచార వాహనంపై నుంచి పడబోయిన బాలకృష్ణ.. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో తుళ్లి వెనక్కి పడిపోయిన బాలకృష్ణ..#Balakrishna #NandamuriBalakrishna #Hindupur #TDP #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/i9TdWSme5A
— NTV Telugu (@NtvTeluguLive) January 26, 2023