ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్లే అధికార, విపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వివరాలు..
కృష్ణా జిల్లా, హనుమాన్ జంక్షన్ లో తెలుగు రైతు విభాగం ఆధర్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని అనుకోవద్దని.. ఏ నిమిషమైనా ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతేకాక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందని ఆరోపించారు. తెలుగు దేశం రైతు విభాగం నేతలు రాష్ట్రంలోని ప్రతి రైతును కలవాలని సూచించారు. మాజీ మంత్రి వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారన్నారు. హత్య కేసు నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుడున్న వ్యతిరేకత ఎప్పుడు లేదని అచ్చెన్నతెలిపారు. అచ్చెన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ సాగుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.