ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వామణి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. తమిళ సినిమాల షూటింగ్ లు తమిళనాడులోనే చేయాలి అంటూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్(ఫెప్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. ఇవి కాస్తా రాజకీయ రంగు కూడా పులుముకున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజాను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. మంత్రి రోజా భర్త ఏపీకీ నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. తన భర్త మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని ఆరోపించారు.
ఏ భాష సినిమాల షూటింగ్ లు ఆ రాష్ట్రంలో జరిగితే బాగుంటుందని మాత్రమే తన భర్త చెప్పారని మంత్రి రోజా తెలిపారు. అలా జరుపుకుంటే ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, ఆ రాష్ట్రంలోని కార్మికుల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశ్యంతో తన భర్త అలా చెప్పడం తప్పా? అని రోజా ప్రశ్నించారు. “నా భర్త సెల్వమణి సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ప్రెసిడెంట్. ఏ లాంగ్వేజ్ సినిమాలు ఆ రాష్ట్రంలో తీసుకుంటే, ఆ రాష్ట్రంలోని టెక్నీషియన్స్ కి, కార్మికులకు పని ఉంటుంది. వాళ్ల కుటుంబాలు బాగుంటాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది అని మాట్లాడారు. అయితే, ఆ వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేయాలనుకుంటోంది. తెలుగు సినిమా షూటింగ్ లు మన ఆంధ్రాలోనూ చేయాలని చెప్పి సీఎం జగన్ జీవో ఇచ్చారు. టీడీపీలో తెలుగు సినిమా హీరోలు, దర్శకులు,నిర్మాతలు చాలామంది ఉన్నారు.
ఇదీ చదవండి:బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంటే చంద్రబాబుకి ఎందుకు అంత ఇష్టం?
వాళ్లందరిని వచ్చి ఆంధ్రాలో షూటింగ్ చేయమనండి. మీ పార్టీలో ఉన్న వాళ్లు ఆంధ్రప్రదేశ్ ను గాలికి వదిలేస్తారు. మీ ఓటుకు నోటు కేసు కోసం ఆ రోజు తెలంగాణ నుంచి పారిపోయి వచ్చేటప్పుడు గుర్తు రాని షూటింగ్ లు, ఇండస్ట్రీ, అభివృద్ధి.. ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు గుర్తు రావడం, నా భర్త చెప్పిన దాన్ని వక్రీకరించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నా భర్త మాట్లాడిన వీడియోను మీరు మళ్లీ ప్లే చేయండి. జనాలు అందరూ వింటారు. వారే అర్థం చేసుకుంటారు” అని మంత్రి రోజా తెలిపారు. మరి.. రోజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.