పురుషాధిక్య రాజకీయాల్లో మహిళలు రాణించడం చాలా అరుదు. ఒకవేళ అవకాశం వచ్చినా సరే.. వారు అంతగా వెలుగులోకి రారు. ప్రభావవంతంగా రాణించలేరు.. తమదైన ముద్ర వేయలేరు. అయితే.. ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం ఇందుకు భిన్నం. సినిమాల్లో ఒక టాప్ హీరోయిన్‌గా ఎలా వెలిగిందో.. రాజకీయాల్లో సైతం ప్రత్యుర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగల నేతల్లో రోజా ముందు వరుసలో ఉంటారు. అలాంటి నేత.. ‘ రాజకీయాల నుంచి తప్పుకుంటా..’ అని బాంబ్ పేల్చారు. ఆ వివరాలు..
‘రాజకీయాల నుంచి తప్పుకుంటా..’ అని ప్రతి ఒక్కరు చెప్పే మాటేగా అని మీకు అనిపించొచ్చు. కానీ, ఈ సందర్భం వేరు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.. మంత్రి రోజా. ఒకవేళ ఎప్పుడైనా పార్టీ మారాల్సి వస్తుందా? వస్తే ఏంటి..? అన్న ప్రశ్నపై స్పందించిన ఆమె..” అలాంటి పరిస్థితి ఎప్పటికే రాదన్న మంత్రి.. ఒకవేళ అలాంటి రోజే వస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పారు. ఈ విషయంపై దేవుడి ముందు ప్రమాణం చేయడానికైనా సిద్ధం అని తెలిపారు. తన పొలిటికల్ లైఫ్ లో ఇంతకుముందే ఒక పార్టీని చూసొచ్చాను అన్న మంత్రి రోజా, ఆ పార్టీ నాయకుడి మెంటాలిటీ, చేసే రాజకీయాలు నచ్చకనే బయటకొచ్చానని తెలిపారు.
కానీ, జగనన్న స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు వేరని తెలిపారు. వైఎస్సార్‌సీపీని రాజకీయ పార్టీ అనడం కంటే.. ఒక కుటుంబంలా చూడొచ్చు అని చెప్పుకొచ్చారు. రాజకీయం అంటే.. ఐదేళ్లకోసారి వచ్చే ఎలక్షన్స్ కోసం, అధికారం కోసం ప్రజలను ఎలా మభ్యపెట్టాలని ఆలోచించే ఈరోజుల్లో.. నిరంతరం ప్రజల గురుంచి ఆలోచిస్తూ.. వారి కష్టాలు తీర్చాలనే తపన ఉన్న ఒకేఒక్కడు.. జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా.. తండ్రి చేయాలనుకున్న పనులను పూర్తి చేసేవరకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాడని తెలిపారు. తమ వల్ల పార్టీకి ఏదైనా ఇబ్బంది వస్తోంది అని తమ నాయకుడు అనుకుంటే.. అలాంటి రోజే వస్తే.. రాజకీయాల నుంచి తప్పకుంటాం.. అంటూ మనస్ఫూర్తిగా చెప్పుకొచ్చారు.