ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే వార్త ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గా చెబుతున్న ఓ న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్ ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉన్నది వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటూ ఏబీన్ లో కథనాలు ప్రసారమయ్యాయి. ఓ మహిళతో ఎంపీ ఇలా వీడియోకాల్ మాట్లాడారంటూ చెబుతున్నారు. పోలీసు అధికారిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి తరహా ప్రవర్తనే ఉండేదంటూ ఎంపీపై ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా ఇలాంటి పనులు చేస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే అందులో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవా? కాదా? ఆ వీడియోలో ఉంది.. నేను కాదు అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఏమైనా ఖండిస్తారా అనేది వేచి చూడాలి. ఈ వ్యవహారంపై ఇంకా ఎంపీ స్పందించలేదు. ఆయన ఎలా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.