సినిమా చూడాలంటే థియేటర్ కి వెళ్లడం ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం ఎంచక్కా ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రతి వారం కూడా పదుల సంఖ్యలో మూవీస్ రిలీజవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చే వాటిలో సమంత ‘యశోద’ తప్పించి చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కాబట్టి చాలామంది ఓటీటీవైపే మొగ్గుచూపుతారు. అందులో భాగంగానే ఈసారి అంటే రేపు ఒక్కరోజే ఏకంగా 20 సినిమాల వరకు రిలీజ్ కానున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా తర్వాత మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చినట్లే సినిమాలు చూసే విషయంలోనూ చాలా ఛేంజెస్ వచ్చాయి. కంటెంట్ ఉన్న సినిమాల కోసం మాత్రం థియేటర్లకు వెళ్తున్నారు. లేదంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందాం లే అని ఆగిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఏ భాషలో సినిమా బాగున్నా సరే వదలడం లేదు. అలా ప్రతివారం కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. మరి అలా రేపు రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.