సమ్మర్ అయిపోవచ్చింది. మే నెల చివరికొచ్చేశాం. ఇకపోతే ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. మూడు రిలీజ్ అవుతున్నాయి కానీ అవన్నీ కూడా చిన్న బడ్జెట్ సినిమాలే. మరోవైపు ఓటీటీలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. దీనికి తోడు గత కొన్ని వారాలతో పోలిస్తే.. ఈసారి 18 సినిమాలు/వెబ్ సిరీసులు మాత్రమే ఓటీటీల్లో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమైపోయాయి. వాటిలో ఒకటి రెండు తెలుగు మూవీస్ మాత్రమే ఉన్నాయి. మరి ఈవారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ సంగతేంటి? చూసేద్దామా!
అసలు విషయానికొచ్చేస్తే.. ఈ మధ్య కాలంలో థియేటర్ల కంటే ఓటీటీలనే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రతివారం 20 అంతకంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటమే దీనికి కారణం అనిపిస్తోంది. ఈ వారం మాత్రం 18 సినిమాలు/సిరీసులు మాత్రమే విడుదలకు రెడీ అయ్యాయి. వీటిలో ముంబైకర్, ఈవిల్ డెడ్ రైజ్ మాత్రమే కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మూవీస్. ‘విశ్వక్’ అనే ఓ తెలుగు మూవీ కూడా వస్తోంది కానీ అది ఎలా ఉంటుందో? ఏంటనేది రిలీజ్ అయితే గానీ తెలియదు. మరి ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లో మీ ఛాయిస్ ఏది? దిగువన పూర్తి లిస్ట్ చూసిన తర్వాత కామెంట్ చేయండి.