ఈ రోజుల్లో ఎప్పుడు, ఏ సినిమా, ఎలా హిట్ అవుతుందనేది చెప్పలేం.. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. మరి కొన్ని సినిమాల విషయంలో ఊహించని షాక్ తగులుతుంది.
ఈ రోజుల్లో ఎప్పుడు, ఏ సినిమా, ఎలా హిట్ అవుతుందనేది చెప్పలేం.. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. మరి కొన్ని సినిమాల విషయంలో ఊహించని షాక్ తగులుతుంది. ఇటీవల అలాగే చిన్న చిత్రంగా వచ్చి, సెన్సేషనల్ హిట్ అయింది ‘సామజవరగమన’.. ఓవర్సీస్ బాక్సాఫీస్ బరిలోనూ సత్తా చాటింది. కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు, ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేశాడు. అవి ఊహించని షాక్ ఇచ్చాయి. దీంతో మళ్లీ తనకి కలిసొచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకున్నాడు. గతంలోనూ వినోదానికి పెద్ద పీట వేస్తూ తను చేసిన చిత్రాలు మంచి విజయం సాధించాయి.
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరోయి. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, అనిల్ సుంకర సమర్పణలో, రాజేష్ దండు నిర్మించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్.. ‘సామజవరగమన’. రిజల్ట్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్, విడుదలకు రెండు రోజుల ముందే ప్రివ్యూ వేశారు. ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షనుల నుండి కూడా పాజిటివ్ టాక్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మౌత్ టాక్‌తో థియేటర్లు, కలెక్షన్స్, ఓవర్సీస్ వసూళ్లు పెంచుకుంటూ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ రూ.30.1 కోట్ల గ్రాస్ రాబట్టి, విజయవంతంగా 2వ వారం కంప్లీట్ చేసుకుంటుంది. ఇక యూఎస్‌లోనూ 1 మిలియన్ మార్క్ టచ్ చేయడానికి అతి దగ్గర్లో ఉంది. సినిమా చూసి అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి చూసే క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ మంచి టాక్ దక్కించుకున్న ‘సామజవరగమన’ ఓటీటీలోకి రావడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈనెల 22 లేదా 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. రెండో వారంలోనూ స్టడీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ శ్రీ విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, ఇప్పటికే దానికి 4 వంతులు ఎక్కువగా రాబట్టింది.