ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు పన్నెండేళ్లపాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’. 2009లో విజువల్ వండర్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన అవతార్ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ రూపొందించిన ఈ అవతార్ 2 మూవీ.. డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఫస్ట్ డే నుండి విజువల్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా వేలకోట్లు కొల్లగొడుతోంది. మొదటి వారంలో సుమారు ఐదు వేల కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన అవతార్ 2.. తెలుగు రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.
అవతార్ 2లో ఈసారి అద్భుతాలతో పాటు ఎమోషనల్ కోర్ కూడా టచ్ చేశాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. విదేశాలలో ఈ సినిమా హవా ఎలా ఉన్నప్పటికీ, ఇండియాలో మాత్రం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగ తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి.. రూ. 10 కోట్లకు పైగా ప్రాఫిట్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది. తెలుగులో రూ. 22 కోట్ల టార్గెట్ తో విడుదలైన అవతార్ 2.. మొదటి వారాంతంలో రూ. 56 కోట్ల గ్రాస్ తో పాటు రూ. 34 కోట్ల షేర్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే.. ఎంతటి విజువల్ వండర్ అయినా.. చిన్న కమర్షియల్ మూవీ అయినా.. థియేట్రికల్ రన్ పూర్తయితే ఓటిటిలోకి రావాల్సిందే.
తాజాగా అవతార్ 2 సినిమా ఓటిటి రైట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. విజువల్ స్పెక్టాకిల్ గా వండర్స్ సృష్టిస్తున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరి ఎన్ని కోట్లకు ఈ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ కొనుగోలు చేసిందో వివరాలు ఇంకా బయటికి రాలేదు. మరి షేర్ బేస్ మీద కొన్నారా? లేక నెట్ అమౌంట్ కి కొన్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఇప్పటివరకు థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ దాదాపు నెల, రెండు నెలల్లోనే ఓటిటిలోకి వచ్చేశాయి. కానీ.. అవతార్ 2 విషయంలో దాదాపు కొన్ని నెలలపాటు వెయిట్ చేయకతప్పదట. ఎందుకంటే..ఓటిటి ఒప్పందం ప్రకారం అవతార్ 2 ఓటిటి రిలీజ్ 234 రోజుల తర్వాతే జరుగుతుందని టాక్ నడుస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉండగా.. అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మరి ఇటీవల అవతార్ 2 మూవీ చూసినవారు ఎలా ఉందో కామెంట్స్ లో తెలపండి.
Avatar (Hindi, English) Streaming On Disney+ Hotstar
Revisit the visual masterpiece “Avatar” before watching the sequel on big screens.
Follow @OTTFunk For More OTTUpdates#Avatar #Avatar2 #AvatarTheWayOfWater #JamesCameron #Hindi #Bollywood #Hollywood #Hotstar #OTTFunk pic.twitter.com/wcVmAIjiz3
— OTTFunk (@OTTFunk) December 16, 2022