ఓ మాదిరి అంచనాలతో తాజాగా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'ఏజెంట్'. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి. ఇంతకీ ఏంటి విషయం?
అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. స్పై థ్రిల్లర్ మూవీగా ప్రచారం చేసినప్పటికీ.. ఆ తరహా స్టోరీ కంటే యాక్షన్ డ్రామానే ఎక్కువగా ఉందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో పెద్దగా పాజిటివ్ టాక్ అయితే ఎక్కడా రావడం లేదు! మరోవైపు అఖిల్ కష్టం వృథా అయిందని సోషల్ మీడియా మొత్తం ఒకటే డిస్కషన్ నడుస్తోంది. సరిగా ఈ సమయంలో ‘ఏజెంట్’ ఓటీటీ డీటైల్స్ బయటకొచ్చేశాయి. ఇంతకీ ఎందులో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం!?
అసలు విషయానికొస్తే.. ప్రతివారం కొత్త మూవీ రిలీజ్ కావడమే లేటు. థియేటర్లలోకి వెళ్లేవారు చాలామంది ఉంటారు. మరికొందరు మాత్రం ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఆ అఖిల్ ‘ఏజెంట్’ గురించి కూడా పలువురు నెటిజన్స్ అలానే సెర్చ్ చేస్తున్నారు. వాళ్లకు డీటైల్స్ కూడా దొరికేశాయి. సినిమా చూసినవాళ్లు, అలానే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న దానిబట్టి ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ‘సోనీ లివ్’ దక్కించుకుంది.
రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి, ప్రేక్షకుల్ని అలరించిన ‘దసరా’ నెలలోపే, ‘రావణాసుర’ అయితే మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రెండు సినిమాలు బట్టి చూసుకున్నా సరే.. ‘ఏజెంట్’ కూడా నెలలోపే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ మూవీలో అఖిల్ తోపాటు మమ్ముట్టి కూడా లీడ్ రోల్ చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. దాదాపు నాలుగేళ్ల తర్వాత సినిమా తీశారు. కానీ హిట్ కొట్టలేకపోయారు. సరే ఇదంతా పక్కనబెడితే ‘ఏజెంట్’ సినిమా చూశారా? చూస్తే ఎలా అనిపించింది. కింద కామెంట్ చేయండి.