వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు గత రెండేళ్లుగా థియేటర్లతో పాటు డిజిటల్ ప్లాట్ ఫాములు సైతం ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు పోటీ పడుతున్నాయి. లాక్ డౌన్ ముందు సినిమాలంటే మొదటి ప్రాధాన్యత థియేటర్స్ కి ఇచ్చేవారు. కానీ.. లాక్ డౌన్ అనంతరం ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు జరిగేసరికి సినిమాలన్నీ రెండు భాగాలుగా డివైడ్ అయిపోయాయి. థియేట్రికల్ సినిమాలు, ఓటిటి సినిమాలు అంటూ రెండు భాగాలు కావడంతో అన్ని సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదు మేకర్స్. అలాగే సినిమా కంటెంట్, హీరో మార్కెట్ బట్టి కూడా అది థియేట్రికల్ సినిమానా లేక ఓటిటి సినిమా అనేది అంచనాలు వేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ లకంటే ఓటిటిలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. అదీగాక జనాలు కూడా ఓటిటి సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఎలాగో యాభై రోజుల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి కదా! అనే ధీమా జనాల్లో కనిపిస్తోంది. ఈ ఒక్క కారణంతో సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లకుండా ఓటిటిలో రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రతి శుక్రవారం మాదిరే ఈ వారం కూడా చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం(రేపు) ఏకంగా 14 సినిమాలు ఓటిటి రిలీజ్ అవుతున్నాయి.
రేపు ఒక్కరోజే ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 14 సినిమాలేవంటే..
ఆహా(Aha):
నెట్ ఫ్లిక్స్(Netflix):
సన్ నెక్స్ట్(Sunnxt):
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
జీ5 (Zee5):
సోనీలివ్(SonyLIV):
వూట్(Voot):
మరి రేపు ఒక్కరోజే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.