ఇండస్ట్రీలో సినీ హీరోగా డెబ్యూ చేసేవారి పేరు ఇదివరకు సెలబ్రిటీలు స్టేజిపై పరిచయం చేస్తేనో, లేదా జనాలు మాట్లాడుకోవడం వల్లనో బయటికి తెలిసేది. ఆ ట్రెండ్ అంతా సోషల్ మీడియా లేనప్పుడు సాగింది. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ట్రెండ్ కి తగ్గట్టుగా ఊహించని స్థాయిలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. దీంతో సెలబ్రిటీ కావాలన్నా, తమ పేరు జనాలకు తెలియాలన్నా సోషల్ మీడియానే పెద్ద ప్లాట్ ఫామ్ అయిపోయింది. అదీగాక సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్నవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే.. టాలీవుడ్ లోకి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ 22 ఏళ్ళ కుర్రాడు హీరోగా డెబ్యూకి రెడీ అయిపోయాడు.
ఇటీవలే తన 22వ పుట్టినరోజు సందర్భంగా మొదటి సినిమాను అనౌన్స్ చేశాడు ఆ కుర్రాడు. అదీగాక రావడంతో టాలీవుడ్ కి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడంటూ తనని తానే ఇంట్రడ్యూస్ చేసుకొని వార్తల్లోకెక్కాడు. ఓ డెబ్యూ హీరో గురించి ఇంత బిల్డప్ ఇస్తున్నారు.. ఎవరతను అంటారా! తెలుగు ప్రేక్షకులకు సీరియల్ నటుడు ప్రభాకర్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెర నటుడిగా, సినీ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఏంటి.. ప్రభాకర్ గురించి ఇప్పుడెందుకు అంటే.. మనం ఇంతవరకు చెప్పుకుంది ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ గురించే. అవును.. అందరికి చంద్రహాస్ అని పేరు తెలియకపోవచ్చు. కానీ, ప్రభాకర్ కొడుకుగా ఓ నాలుగు రోజుల నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
ఇక చంద్రహాస్ తన డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ నుండే సోషల్ మీడియా అటెన్షన్ అందుకోగలిగాడు. తన మాటలు, ప్రెస్ మీట్ లో తన యాటిట్యూడ్ ఇలా మొత్తంగా కెమెరా ముందు పెట్టేసి సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమర్స్ కి హాట్ టాపిక్ గా మారాడు. అందులోనూ మొదటి సినిమా అనౌన్స్ మెంట్ లోనే ఏకంగా మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసి.. “ఇంకా ఉన్నాయి కానీ చెబితే ఓవర్ యాక్షన్ అవుతుందేమో” అంటూ చెప్పడం ట్రోల్స్ కి కారణమైందని అంటున్నారు. అదీగాక ఓవైపు పేరెంట్స్ మాట్లాడుతుండగా.. ఇతను జేబులో చేతులు పెట్టుకొని స్టైల్ కొట్టడం ట్రోల్స్ కి మరో కారణం. మొత్తానికి చంద్రహాస్ యాటిట్యూడ్ పై ట్రోల్స్ వస్తున్నాయి.. కానీ, అతని యాటిట్యూడ్ మొదటి నుండి అంతేనని అతని పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది.
ఈ క్రమంలో చంద్రహాస్ పై వస్తున్న ట్రోల్స్, ఇంత సోషల్ మీడియా బజ్.. అతని కెరీర్ కి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ.. గతంలో సోషల్ మీడియా క్రేజ్ తో, ఓన్ యాటిట్యూడ్ తో స్టార్స్ అయిన హీరోలు కూడా ఉన్నారు. ఒక విజయ్ దేవరకొండ, ఒక విశ్వక్ సేన్.. ఇలా వీరు వారి యాటిట్యూడ్ తో, రఫ్ అండ్ టఫ్ మాటతీరుతో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. అప్పుడు వారి యాటిట్యూడ్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి.. కానీ, ఆ యాటిట్యూడే ఇప్పుడు వారికంటూ ఓ యూనిక్ స్టైల్ అనే ముద్ర వేసింది. మరిప్పుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ని, అతని పేరును తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ.. అతనెవరు, ఏంటి అనేది జనాలకు మీమర్లే దగ్గర చేశారు. మరి ఫ్యూచర్ లో చంద్రహాస్ హీరోగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. ఇక చంద్రహాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.