ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోలుగా కొత్తవాళ్ళు డెబ్యూ చేయదనేది జరుగుతూనే ఉంటుంది. కొందరు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వస్తుంటారు. మరికొందరు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తుంటారు. అయితే.. ఎంతమంది ఎలా వచ్చినా ఇండస్ట్రీలో హీరోలుగా నిలబడాలంటే కేవలం హీరో లుక్ ఉంటే సరిపోదు. తమకు తాము హీరో అని ప్రచారం చేసినా అయిపోరు. హీరో అంటే పూర్తిస్థాయిలో టాలెంట్ ఉండాలని ఇప్పటివరకూ ఎన్నో సందర్భాలలో, చాలామంది విషయాలలో ప్రూవ్ అయ్యింది. ఇక ఇండస్ట్రీలోకి సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఓ 22 ఏళ్ళ యంగ్ కుర్రాడు హీరోగా డెబ్యూకి రెడీ అయిపోయాడు.
అదీగాక మొదటి సినిమా అనౌన్స్ మెంట్ లోనే ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్ చేయడం విశేషం. ఇన్ని బిల్డప్పులు ఇస్తున్నారు.. ఇంతకీ ఎవరా అప్ కమింగ్ హీరో అనుకుంటున్నారా? అతని పేరు ఆల్రెడీ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో, మీమ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికైనా చెప్పరా బాబు అంటారా.. ఆ హీరో ఎవరో కాదు.. ప్రముఖ సీరియల్ నటుడు, సినీ దర్శకుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. ఇటీవల చంద్రహాస్ 22వ బర్త్ డే సందర్భంగా ప్రభాకర్ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హీరోగా డెబ్యూ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే చంద్రహాస్ టాలెంట్ చూసి మొదటి సినిమాకు ముందే మరో రెండు సినిమాలు అధికారికంగా ఓకే అయ్యాయని చెప్పడం గమనార్హం.
ఇక చంద్రహాస్ విషయానికి వస్తే.. ఇంట్రడక్షన్ స్పీచ్ లోనే అందరి అటెన్షన్ దక్కించుకున్నాడు. కానీ.. హీరోగా కంటే చంద్రహాస్ గురించి కామెడీగా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు జనాలు, నెటిజన్స్. చంద్రహాస్ కి డాన్స్ లో టాలెంట్ ఉందని నాటు నాటు కవర్ సాంగ్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు. మరి యాక్టింగ్ స్కిల్స్ గురించి తెలియాలంటే అతని సినిమాలు వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికైతే ట్రోలర్స్ కి, మీమర్స్ కి మంచి హాట్ టాపిక్ లా మారాడు చంద్రహాస్. అందులోనూ తాను నలుగురిని నవ్వించగలిగితే చాలంటూ స్పీచ్ లో చెప్పాడు కాబట్టి.. మీమర్స్ అంతా చంద్రహాస్ ని ట్రోల్ చేస్తూ నెటిజన్స్ ని నవ్వించే పనిలో పడ్డారని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా.. మూవీ లాంచ్ లో చంద్రహాస్ యాటిట్యూడ్ చూసి అందరూ నెగటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. కానీ.. ఆ కుర్రాడి యాటిట్యూడే అంతా.. అని అతని పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అయితే.. చంద్రహాస్ తనకు ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లంటే ఇష్టమని చెప్పాడు. చిన్నప్పటి నుండే సినిమాల మీద పిచ్చితో పెరిగిన చంద్రహాస్ కి 10వ తరగతి నుండే హీరో అయిపోవాలని ఉండేదంటూ చెప్పాడు. ఇక చంద్రహాస్ డెబ్యూ మూవీ విషయానికి వస్తే.. కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి నిర్మిస్తున్నారు. ఇక రెండో సినిమాను ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై ఏవీఆర్, నరేష్ నిర్మాణంలో సంపత్ వి. రుద్ర తెరకెక్కించనున్నాడు. మూడో సినిమాను ప్రభాకర్ సొంత బ్యానర్ లో నిర్మించనున్నట్లు తెలిపారు. మరి నెట్టింట ట్రోల్ అవుతున్న చంద్రహాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.