టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు అంబటి రాయుడికి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. నువ్వు బంతిని బౌండరీ అవతలకు కొడుతుంటే నా 3డీ గ్లాస్సెస్‌లో చూడాలని ఉందని, గుడ్‌లక్ ఫర్ ఐపీఎల్ అంటూ పోస్టు చేశాడు. కాగా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ 3డీ గ్లాస్సెస్ వెనుక పెద్ద కథే ఉంది. గతంలో అంబటి రాంబాబును సెలెక్టర్లు జాతీయ జుట్టకు ఎంపికచేయలేదు. మంచి ఫామ్‌లో ఉన్న రాయుడికి కచ్చితంగా జాతీయ జట్టులో చోటు దక్కుతుందని అతనితో పాటు అందరు భావించారు.
కానీ సెలెక్టర్లు అతన్ని కాకుండా విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. దీనిపై అప్పటి సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇస్తూ విజయ్ శంకర్‌ను త్రీ డైమెన్షన్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. సెలెక్టర్ల నిర్ణయాన్ని విమర్శిస్తూ ఆ త్రీ డైమెన్షన్ ఫర్ఫమెన్స్ చూసేందుకు 3డీ గ్లాస్సెస్ ఆర్డర్ ఇచ్చి తెప్పించానంటూ అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ పోస్టు పెనుదుమారమే రేపింది. అనంతరం రాయుడు క్రికెట్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. మళ్లీ దాన్ని వెనక్కుతీసుకోవడం కూడా జరిగిపోయింది. కాగా దాన్ని అందరు మర్చిపోతున్న తరుణంలో యూవీ మళ్లీ గుర్తుచేసినట్లు అయింది తన పోస్టుతో. ఆ పోస్టు పాజిటివ్‌గా పెట్టాడా? నెగటివ్‌గా పెట్టాడా అనేది అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.