ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్ రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీ సంకేలో ఓమిక్రాన్ కేసులు నమోదు అవడంతో భారత్ తో సహా మిగతా దేశాలన్నీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కొన్ని కఠినమైన ఆంక్షలతో దేశంలో కరోనా టెస్టులు కట్టుదిట్టం చేసాయి. ఇండియాలో ప్రస్తుతం 25కి పైగా కేసులు బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటువంటి క్లిష్టమైన తరుణంలో ఓమిక్రాన్ వేరియెంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) గుడ్ న్యూస్ తెలిపింది. ఒమిక్రాన్.. ఇదివరకు వ్యాపించిన వేరియంట్స్ కంటే ప్రమాదమని, ప్రస్తుతం ఉన్న టీకాలు దీనిపై సమర్ధవంతంగా పనిచేయవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. ఇప్పటివరకు చూసిన డెల్టా, ఇతర వేరియంట్ల కంటే తీవ్రమని సూచించడానికి ఆధారాలు లేవని తెలిపారు. ఇప్పుడున్న టీకాలు.. ఓమిక్రాన్ నుండి కాపాడగలవని భావిస్తున్నట్టుగా ర్యాన్ చెప్పారు. ఏది ఏమైనా.. ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఓ అంచనాకు రావడానికి మరింత పరిశోధన అవసరమని మైఖేల్ ర్యాన్ క్లారిటీ ఇచ్చారు.