ప్రజలకు రవాణా వ్యవస్థను చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ విభిన్న పథకాలతో ముందుకు వస్తుంది. ఇప్పటికే లాజిస్టిక్ సేవలు, ఇతర సేవలతో ఆర్థిక భారంతో పెనుగులాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్. తాజాగా మరో పథకాన్ని తీసుకు వచ్చారు.
మన సిటీలో తిరగాలన్నా, కాలేజీ, ఆఫీసులకు, ఎటు పోవాలన్నా అత్యంత అనువైన వాహన సాధనం బస్సు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. అందుకే ఆర్టీసీ అధికారులు సైతం సురక్షితం ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రయాణించండి అంటూ ప్రచారం చేస్తుంటారు. అయితే తెలంగాణ ఆర్టీసీ మరింత విభిన్నం. ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేసేందుకు వినూత్నమైన పథకాలను రూపొందిస్తూ ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, అదే సమయంలో ప్రజలకు చేరువయ్యే విధంగా పథకాలను రూపొందిస్తున్నారు ఎండీ సజ్జనార్.
తాజాగా మరో పథకంతో ముందుకు వచ్చింది టీఎస్ఆర్టీసీ. విద్యార్థినులు, మహిళలకు శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రద్దీగా ఉన్న రూట్లలో విద్యార్థినులు, మహిళల కోసం ప్రత్యేకంగా లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతోంది. వీరి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని విద్యార్థినులు, మహిళలు క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది. రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన టీఎస్ఆర్టీసి 12 కారిడార్లలో 85 అదనపు బస్సులను నడపాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేసింది. ఇందుకు సంబంధించి బస్సుల టైమింగ్స్ కూడా ప్రకటించింది.
ఈ ప్రత్యేక బస్సులకు సదుపాయానికి సంబంధించిన వివరాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రీట్వీట్ చేశారు. ‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థినులు, మహిళలకు శుభవార్త. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసింది. రద్దీ సమయాల్లో లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని క్షేమంగా, సురక్షితంగా విద్యాసంస్థలకు చేరుకోండి.’అని ట్వీట్ చేశారు. ఆయన ఎండీ అయిన నాటి నుండి పలు విభిన్న పథకాలను తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. టీఎస్ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థినులు, మహిళలకు శుభవార్త. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను #TSRTC యాజమాన్యం ఏర్పాటు చేసింది. రద్దీ సమయాల్లో లేడీస్ స్పెషల్ బస్సులను నడపుతోంది.
ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని క్షేమంగా, సురక్షితంగా విద్యాసంస్థలకు చేరుకోండి. @TSRTCHQ pic.twitter.com/aOYpTvM4f8
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 4, 2023