ఢిల్లీ- పెళ్లి అంటే ఉండే సందడి, సరదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాహ వేడుకలో ఎవరు ఎంత హడావుడి చేసినా, పెళ్లి కూతురు మాత్రం సిగ్గుపడుతూ ఉండటమే మనకు తెలుసు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లి కూతుర్ల వరస మారిపోయింది. పెళ్లి కూతుళ్లే పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నారు.
అవును ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లిలో హడావిడి అంతా వధువు చేతుల్లోనే ఉంటుంది. తన వివాహ వేడుక జీవితాంతం గుర్తిండిపోయే విధంగా, విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు. పెళ్లి ఏవిధంగా జరగాలో కూడా వారే డిసైడ్ చేస్తున్నారు. పెళ్లి బట్టల నుంచి నగల వరకు అన్ని వాళ్లే స్వయంగా షాపింగ్ చేస్తున్నారు. ఇక మెహెందీ ఫంక్షన్లు, సంగీత్ వేడుక, పెళ్లి దగ్గర డ్యాన్సులతో అదరగొడుతున్నారు.
మొన్నా మధ్య మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా సాంగ్ కు డ్యాన్స్ చేయడంతో ఎంతలా వైరల్ అయ్యిందో తెలుసు కదా. ఇదిగో తాజాగా గుర్గావ్‌కు చెందిన సబా కపూర్ అనే యువతి పెళ్లి మండపం వద్దకు వెళ్లే సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది.
కత్రినా కైఫ్, సిద్ధార్త్ మల్హోత్రా కలిసి నటించిన బార్‌బార్ దేఖో సినిమాలోని.. సా ఆస్‌మానోకో.. పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టింది. అందరితో డ్యాన్స్ చేస్తూ చివరకు పెళ్లి కొడుకు దగ్గరకు చేరుకొని మోకరిల్లి అతడికి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. పెళ్లి కూతురు ఇచ్చిన సినిమాటిక్ ఎంట్రీకి పెళ్లి కొడుకు ఫిదా అయిపోయాడు. ఇంకేముంది కొత్త పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. మరింకేందుకు ఆలస్యం, నవ వధువు డ్యాన్స్ ను మీరు చూసెయ్యండి.
View this post on Instagram
A post shared by YSDC Wedding Choreography (@ysdcweddingchoreography)
If my entire family doesn’t recreate this on my hypothetical wedding, I will die a sad brown girl. pic.twitter.com/8y3b5pLU3g
— harram (@diaryofashrimp) December 25, 2021