తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి స్కూల్స్ ఓపెన్ అవుతాయని ప్రభుత్వం ప్రకటించగానే తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. థర్డ్ వేవ్ రావడం ఖాయం అని ఒకవైపు సూచనలు ఇస్తూనే.., స్కూల్స్ తెరవడం ఏమిటి అని పేరెంట్స్ ప్రశ్నిస్తూ వచ్చారు. ఇంకొంత మంది పిలల్లని స్కూల్స్ కి పంపాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. అయితే.., ఈ విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ ని పై మంగళవారం ఉదయం విచారణ జరిగింది. విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్ ప్రారంభంపై ఓ వారం పాటు హైకోర్టు స్టే విధించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్కూల్స్ నిర్వహణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వవాన్ని వెల్లడించింది. హైకోర్టు తీర్పుతో తల్లిదండ్రులకి కాస్త ఊరట లభించినట్టు అయ్యింది. మరి.. స్కూల్స్ ప్రారంభంపై స్టే విధించడం విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.