హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ క్యాబినెట్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ప్రగతి భన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలోని కరోనా తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృుంబిస్తున్న తరుణంలో లాక్ డౌన్ పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఐతే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా అక్కడ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదని, పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని మఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధింపు పై భిన్నావాదనలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ వల్లే కరోనా అదుపులోకి వస్తుందని కొన్ని వర్గాలు వాదిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే లాభ, నష్టాలరై మంత్రివర్గంలో సుదీర్గంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో మంగళవారం జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.