చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కొంత మంది వృద్ధాప్యంతో కూడిన సమస్యలు, మరికొంత మంది అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా..
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు.. అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కొంత మంది నటులు వృద్ధాప్యంతో కూడిన సమస్యలు, మరికొంత మంది అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శరత్ బాబు మరణించిన సంగతి విదితమే. తన సంగీతంతో కుర్రకారుకు హుషారు తెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ గుండె పోటుతో చనిపోయారు. తొలి తరం మహిళా యాంకర్ గీతాంజలి అయ్యార్ మృతి చెందారు. ఆ తర్వాత స్టార్ విలన్ కజాన్ ఖాన్, నిన్నటికి నిన్న ప్రముఖ సింగర్ శారద తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మరో నటుడు చనిపోయారన్న వార్త వచ్చింది.
తమిళ నటుడు ప్రభు కన్నుమూశారు. అనేక సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఆయన నాలుగో దశ క్యాన్సర్‌తో పోరాడి తుదిశ్వాస విడిచారు. ధనుష్ సినిమా ‘పడికథావన్’లో అతడికి మంచి గుర్తింపు ఉన్న పాత్ర దక్కింది. సుమారు తమిళంలో 100 పైగా చిత్రాల్లో నటించారు. లాక్‌డౌన్ సమయంలో అవకాశాలు లేకపోవడంతో పాటు క్యాన్సర్ చుట్టుముట్టడంతో.. డబ్బులు లేక సరైన చికిత్స పొందలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయన బ్రతకలేదు. ప్రభు క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రిలో పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతడి నిస్సహాయ స్థితి తెలిసి.. అతడి పార్టీవ దేహానికి అంత్యక్రియలు చేశారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్.
నటుడు ప్రభు మరణ వార్తను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఇమ్మాన్.. ఆయనకు సంతాపాన్ని తెలియజేశారు. ‘నటుడు ప్రభు (పడికథావన్, అనేక ఇతర చిత్రాలు) మాతో లేరు. అతను స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతూ ఉదయం (జూన్ 14) ఇతర ప్రపంచానికి చేరుకున్నాడు. వైద్యులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు అతనిని బ్రతికించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. రెస్ట్ ఇన్ పీస్ సోదరా. నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అయితే నటుడు అనారోగ్యానికి చికిత్స చేయడానికి అతను ఆర్థికంగా సహాయం చేశాడని కూడా సమాచారం.
Actor Prabhu (Padikkathavan and Numerous other films) is no more with us. He had suffered from stage 4 cancer.
And Ascended to the other world this morning.Doctors,nurses,social activists tried their level best to retrieve him.But couldn’t.
Rest In peace brother. My heartfelt… pic.twitter.com/2Yu74ZDieN— D.IMMAN (@immancomposer) June 14, 2023