అమ్మకు అండగా ఉండాలనుకుంది ఆ యువతి. కానీ ఆ అమ్మకే భారంగా మారి.. మంచానికే పరితమైంది. సదరు యువతి వేదనను చూసిన సుమన్ టీవీ ఆమెకు చేయందించింది. మరికొన్ని చేతుల సహాయంతో ఆ యువతికి నడకను ప్రసాధించింది.
కుడిచేత్తో చేసిన సహాయం.. ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. ఇక చేసిన పని పది మందికి చెబితే, అందులో కనీసం ఇద్దరైనా ఇన్స్పైర్ అయ్యి మరోకరికి చేయూతనిస్తారన్నది కాదనలేని వాస్తవం. ఇక నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పక్కన ఉండే వారి గురించి పట్టించుకునే నాథుడే కరువైన రోజులు ఇవి. పక్కింటి వారి సంఘతి పక్కన పెడితే సొంత బంధువులే పట్టించుకోని రోజులు ఇవి. అలాంటి కాలంలో నడవలేని స్థితిలో ఓ యువతికి నడకను అందించింది సుమన్ టీవీ. సొంత ఖర్చుతో ఆ యువతికి ఆపరేషన్ చేయించింది. సదరు యువతి ఎవరో తెలీక పోయినప్పటికీ మానవతా ధృక్పథంతో స్పందించారు సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్. తల్లికి సహాయంగా ఉండాల్సిన యువతి తల్లికి భారం కాకుడదని సదరు యువతికి బాసటగా నిలిచారు. నాడు నడవలేని స్థితిలో ఉండి.. నేడు తన కాళ్లపై తనే ఉన్న యువతి జీవితం గురించి తన మాటల్లోనే విద్దాం..
“అమ్మకు అండగా ఉండాల్సిన నేను ఇలా అమ్మకే భారంగా మారతానని అనుకోలేదు. నేను మంచిగా ఉంటే జాబ్ చేసి అమ్మను బాగా చూసుకుంటానని అనుకున్నాను. కానీ నా కాలుకు వచ్చిన సమస్య ఎంతకు తగ్గలేదు” అంటూ ఆ యువతి కన్నీరు కారుస్తూ చెప్పిన మాటలు వేల గుండెలను కదిలించాయి. ఇక కన్న కూతురు ఇలా మంచంపైనే పడి ఉండటం చూసిన ఆ తల్లి గుండె తల్లడిల్లుతూ.. కన్నీరు కార్చని రోజంటూ లేదు. ఈ క్రమంలోనే కొద్దికొద్దిగా అందుతున్న సహాయాలతో ఆపరేషన్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ అధినేత సుమన్ ఆ ఆసుపత్రికి ఫోన్ చేసి మీరు ఆపరేషన్ చెయ్యండి చివరికి డబ్బులు ఎంత తక్కువైతాయో ఆ డబ్బులు మెుత్తం నేను ఇస్తానని సుమన్ సర్ తెలిపినట్లు ఆ యువతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను ఇలా నడవగలుగుతున్నాను అంటే దానికి కారణం సుమన్ టీవీనే అని, అందుకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటానని ఆమె అన్నారు.
ఇక నేను ఎవరో తెలియనప్పటికీ సుమన్ టీవీలో వచ్చిన నా వీడియో చూసి చాలా మంది నాకు కాల్ చేసి సహాయం చేశారు అని యువతి తెలిపింది. ఇక ఆర్థిక సహాయంతో పాటుగా నా కోసం పూజలు కూడా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి నేను అన్ని పనులు చేస్తున్నాను. కిడ్డి బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న చిన్నారులు కూడా నాకు సహాయం చేశారు, అందుకు నాకు వారికి ఎలా ధన్యవాదాలు తెలపాలో తెలియడం లేదన్నారు. ఇక తనకు సహాయం చేసిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. మరి ఓ యువతికి నడక ప్రసాదించిన సుమన్ టీవీ, సహాయం చేసిన వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.