డిజిటిల్ మీడియా ప్రపంచంలో సుమన్ టీవీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. 4 కోట్ల 50 లక్షల మంది నెట్‌వర్క్ సబ్ స్క్రైబర్స్ తో, రోజుకి 2 కోట్లకు పైనే వ్యూవర్ షిప్ తో సుమన్ టీవీ సౌత్ ఇండియాలోనే లీడింగ్ డిజిటిల్ నెట్‌వర్క్ గా కొనసాగుతోంది. అయితే.., సుమన్ టీవీని మరో స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో యాజమాన్యం ముందడుగు వేసింది. అన్నీ హంగులతో హైదరాబాద్ లో సరికొత్తగా 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ స్టూడియోని నిర్మించింది. ఇండియాలోనే మొట్ట మొదటిదైన ఈ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదగా సుమన్ టీవీ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ ను ప్రారంభించడం విశేషం.
ఇక చిరంజీవితో పాటు మాజీ ఎంపీ మురళి మోహన్, హీరో శ్రీకాంత్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, నటుడు ఉత్తేజ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వంటి ప్రముఖులు అతిధులుగా విచ్చేసి సుమన్ టీవీ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ స్టూడియో ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఒక సామాన్య వ్యక్తిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.., ఈరోజు డిజిటిల్ మీడియా ప్రపంచంలో ఒక శక్తిగా ఎదిగిన సుమన్ టీవీ నెట్ వర్క్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.సుమన్ కృషిని, పట్టుదలని ఈ సందర్భంగా అతిధులు కొనియాడారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ:
“సుమన్ టీవీ.. సమాజంలో ఏ ఒక్కరి పక్షానో ఉండకుండా సమానత్వం, సమభావం, సమన్యాయంతో వాస్తవాలను అందిస్తుంది. సుమన్ టీవీ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ కూడా అదే పంధాలో ముందుకు వెళ్తుందన్న నమ్మకం నాకు ఉంది. సుమన్ నెట్‌వర్క్ పేరుతో దాదాపు 150 ఛానెల్స్ ఉండటం గర్వకారణం. మహాశివరాత్రి రోజున ఇలా కొత్త స్టూడియోను నా చేతుల మీదగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. సుమన్ టీవీ ఫౌండర్, ఎండీ అండ్ సీఈవో సుమన్ ను చాలా కాలంగా చూస్తున్నాను. కృషి పట్టుదలతో ఆయన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇలా.. కష్టపడి పైకి వచ్చిన సుమన్ పై నాకు అపారమైన నమ్మకం ఉంది. రానున్న కాలంలో సుమన్ టీవీ ఇంకెన్నో విజయాలను అందుకోవాలి అని” మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ:
“శివరాత్రి పర్వదినాన సుమన్ టీవీ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ ప్రారంభోత్సవానికి హాజరవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. డిజిటిల్ రంగంలో సౌత్ ఇండియాలోనే లీడింగ్ లో ఉన్న సుమన్ టీవీ.. రానున్న కాలంలో మరిన్ని విజయాలను అందుకోవాలి” అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కోరుకున్నారు.
నటుడు, ప్రముఖ నిర్మాత మురళి మోహన్ మాట్లాడుతూ:
“మహాశివరాత్రి పర్వదినాన సుమన్ టీవీ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్.. మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదగా ప్రారంభం కావడం, అందులో నేను భాగ్య స్వామ్యం కావడం ఆనందంగా ఉంది. సామాన్యమైన ప్రజల పక్షాన ఉంటామన్న సుమన్ టీవీ స్లోగన్ చాలా బాగుంది. సమాజంలో అన్యాయమైపోతున్న సామాన్యులకు సుమన్ టీవీ అండగా నిలవాలి. కేవలం 6 ఏళ్ళ ప్రస్థానంలో ఇంతటి విజయాన్ని అందుకున్న సుమన్ టీవీ.. రానున్న కాలంలో మరిన్ని విజయాలను అందుకోవాలి అని మాజీ ఎంపీ మురళి మోహన్ కాంక్షించారు.
నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ:
“సుమన్ టీవీ ఒక డిజిటిల్ విప్లవం. ఇంత నెట్‌వర్క్ ఉన్న సంస్థ .. ఇలా 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ ప్రారంభించడం మంచి విషయం. ఈ రంగంలో సుమన్ టీవీ ఇంకా ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలి” అని నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ మనసు పూర్తిగా కోరుకున్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ:
“సుమన్ టీవీ నెట్‌వర్క్ స్థాయి అందరికీ తెలిసిందే. అలాంటి సుమన్ టీవీ.. 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ ప్రారంభోత్సవానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా సుమన్ టీవీ కి సబ్ స్క్రయిబర్ ని. ఈ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది” అని హీరో శ్రీకాంత్ కాంక్షించారు
నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ:
“6 ఏళ్ల ప్రయాణంలోనే సుమన్ టీవీ సౌత్ ఇండియాలోనే లీడింగ్ డిజిటిల్ మీడియా అయ్యిందంటే.. సుమన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ సుమన్ గారి కృషి, పట్టుదలే కారణం. ఏ రంగంలో అయినా వేగంగా ఎదగాలి అంటే.. అందరిని కలుపుకుని పోవాలి. సుమన్ గారికి ఆ మంచి వ్యక్తిత్వం ఉంది. ఆయనని కలిసిన ఒకటి, రెండు సమయాల్లోనే నాకు ఆ విషయం అర్ధమైంది. సుమన్ టీవీలానే.. సుమన్ టీవీ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ కూడా విజయవంతం అవ్వాలని ఉత్తేజ్” కోరుకున్నారు.
సుమన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ సుమన్ మాట్లాడుతూ:
“సుమన్ టీవీ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ ఇంత మంది అతిధుల చేతుల మీదగా ప్రారంభమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సుమన్ టీవీ మొత్తం ప్రయాణంలో ఎప్పుడు సామాన్యులకి అండగా ఉంటూ వచ్చింది. ఇకపై ఈ 24/7 డిజిటిల్ న్యూస్ ఛానెల్ కూడా సామాన్యడి పక్షానే నిలుస్తుంది” అని తెలియచేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.