ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప టీం సక్సెస్ మీట్‌తో బిజీగా ఉంది. పుష్ప పార్ట్ 2 ఉంటుందని ఇప్పటికే దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. సీక్వెల్ టైటిల్ పుష్ప: ది రూల్ అని కూడా ఇప్పటికే వెల్లడించారు.
This man redefined the word acting and Verstality 🙏
Best Actor in Current generation @alluarjun #Pushpa pic.twitter.com/0RzzPu4Brc
— Bunny – Youth Icon Of South India (@BunnyYouthIcon) December 23, 2021
ఇది కూడా చదవండి : పుష్ప-2 కథ లీక్! క్లైమాక్స్ లో ఫ్యాన్స్ కి భారీ ట్విస్ట్!
తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప-2 రిలీజ్ డేట్ వెల్లడించాడు సుకుమార్. డిసెంబర్ 17, 2022న పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘పుష్ప : ది రూల్ కు సంబంధించి ఇప్పటికే 2 సీన్లు షూట్ చేశాం. స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. పుష్ప 2 మరింత ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆడియెన్స్‌కి మాటిస్తున్నాను.. మిమ్మల్ని నిరుత్సాహపరచను.. సీక్వెల్‌ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక డిసెంబర్ 17, 2022న పుష్ప-2ని రిలీజ్ చేస్తాను’’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి : అన్ స్టాపబుల్’ బాలయ్యతో.. ‘తగ్గేదే లే’ అంటున్న పుష్ప టీమ్!