ఇంటర్నేషనల్ డెస్క్- అదృష్టం తలుపు తట్టినప్పుడే డోర్ తీయాలి.. ఆలస్యం చేస్తే ఇక అంతే సంగతులు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడో కాని మన తలుపు తట్టదు. ఆ సమయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఎప్పటిలాగే దురదృష్టం మన వెంటే ఉంటుంది. కొన్ని సందర్బల్లో అదృష్టానికి సంబందించి చాలా చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. లాటరీ రూపంలో తనను వరించిన అదృష్టాన్ని కోపంతో విసిరేసింది ఓ మహిళ. చివరికి తానేం కాలదన్నకుందో తెలుసుకుని నాలుక్కరుచుకుంది. చివరికి తేరుకుని మళ్లీ తన అదృష్టాన్ని దక్కించుకుంది. అమెరికా లోని మసాచుసెట్స్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన అభీ అనే వ్యక్తి లక్కీ స్టాప్ అనే లాటరీ టికెట్ల షాప్‌ను నడుపుతున్నాడు. లీ రోజ్ అనే మహిళ ఈ లాటరీ షాప్ లో రెగ్యులర్ గా టిక్కెట్ కొంటుందట.
మొన్న మార్చి నెలలో లాటరీ షాప్‌కు వెళ్లిన ఆమె ఎప్పటిలాగే లాటరీ టిక్కెట్ కొనుక్కుంది. ఆ తరువాత ఆ టికెట్ ను స్క్రాచ్ చేసింది. ఐతే ఆ సమయంలో ఆకలి వేస్తుండటంతో లంచ్‌కు వెళ్లాలనే తొందరలో దాన్నిలాటరీ టిక్కెట్ ను సరిగా పరిశీలించకుండానే, దాన్ని ఆ షాప్‌లో ఓ మూలన విసిరేసి వెళ్లిపోయింది. ఐతే ఆ తరువాత అక్కడే మిగతా టికెట్ల కుప్పలో లీ రోజ్ పడేసిన టిక్కెట్ ను చూసి షాప్ యజమాని అభీ చూసి ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఈ టిక్కెట్ కు ఏకంగా 7 కోట్ల 30 లక్షల రూపాయల లాటరీ తగిలింది. దీన్ని లీ రోజ్ ఇక్కడెందుకు పడేసిందని ఆలోచనలో పడ్డాడు. ఇక లాటరీ తగిలిన ఈ టికెట్ విషయంలో ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోలాన్నదైనిపై షాప్ యజమాని అభి ఫ్యామిలీ రెండు, మూడు రోజులపాటు అతర్జనబర్జన పడిందట.
ఆ లాటరీ డబ్బుతో తన కోసం ఓ కారు కొనుక్కోవాలని అభి భావించాడు. ఐతే టిక్కెట్ కొని కస్టమర్ గెలిచిన లాటరీ డబ్బు న్యాయంగా వారికే చెందాలని కుటుంబ సబ్యులు సూచించడంతో ఆతను మనసు మార్చుకున్నాడు. వెంటనే లాటరీ టిక్కెట్ కొన్న లీ రోజ్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఐతే ముందు ఆమె ఏ మాత్రం నమ్మలేదట. మరుసటి రోజు లాటరీ షాప్‌కు వచ్చి టికెట్ చూసుకున్న లీ రోజ్ ఆనందానికి అంతే లేదు. సంతోషంతో షాప్ యజమాని అభిని గట్టిగా కౌగిలించుకుందట. 7 కోట్ల 30 లక్షల రూపాయల లాటరీ టిక్కెట్ ను నిజాయితీగా అప్పగించినందుకు అందరు షాప్ నిర్వాహకుడిని అభినందించారు. చూసారు కదా.. అదృష్టం వచ్చినప్పుడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు. షాపు యజమాని నిజాయితీగా టిక్కెట్ ను తిరిగి ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే లీ రోజ్ తన అదృష్టాన్ని కాలదన్నుకున్నట్టే కదా.