రైతుల సంక్షేమం కోసం, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొత్త కొత్త పథకాలను తీసుకొస్తూనే ఉన్నారు. తాజాగా రైతుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొందరు రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.4 వేలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రైతులకు ఒకేసారి వారి ఖాతాల్లో రూ.4 వేలు జమ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇది అందరు రైతులకు కాదు. కొందరు రైతుల ఖాతాల్లో మాత్రమే రూ.4 వేలు జయచేయనున్నారు. ఇది కొత్త పథకం కాదులెండి. రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగానే చేయనున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 13 విడతలు రైతుల ఖాతాల్లో కేంద్రం నగదు జమ చేసింది. ఇప్పుడు 14వ విడత నిధుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది.
రైతుల సంక్షేమం కోసం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏటా రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేస్తారు. అయితే ఈ రూ.6 వేలను ఒకేసారి జమ చేయరు. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే ఈ స్కీమ్ కింద రైతులకు 13 విడతలు నగదు జమ చేశారు. ఇప్పుడు 14వ విడత నిధుల విడుదలకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్రం రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొందరు రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.4 వేలు జమ చేయాలని భావిస్తోంది.
అయితే అందుకు కారణం లేకపోలేదు. 13వ విడత నిధుల విడుదల సమయంలో కొందరు రైతులకు ఆ డబ్బు జమ కాలేదు. ఎందుకంటే వారు వారి వివరాలను వెరిఫికేషన్ చేసుకోలేదు. నగదు విడుదల తర్వాత చాలా మంది రైతులు వారి వివరాలను వెరిఫై చేసుకున్నారు. అలా వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న రైతులకు 14వ విడత నిధుల విడుదల సమయంలో రెండు టర్ములవి కలిపి రూ.4 వేలు జమ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా ఎవరైనా రైతులు వారి వివరాలను వెరిఫికేషన్ చేసుకోకపోతే వెంటనే వెరిఫై చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా వారి వివరాలను వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి నిధులు ఆగితే.. రెండు టర్ముల డబ్బు కోల్పోవాల్సి రావచ్చు.