సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. దేశంలో ఏ సంచలన ఘటన చోటు చేసుకున్నా వెంటనే దానిపై తనదైన స్టైల్లో ట్విట్ చేస్తుంటారు. సినీ, రాజకీయ నేతలపై సెటైర్లు వేస్తూ ట్విట్ చేయడం.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన చికోటి ప్రవీణ్ ని కలిశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చికోటీ ప్రవీణ్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. క్యాసినో , మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ని విచారించిన విషయం తెలిసిందే. ఆ మద్య ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. చికోటి ప్రవీణ్ సినీ, రాజకీయ నేతలో అత్యంత సన్నిహితంగా ఉంటారు. అప్పట్లో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.. విలన్ గా నటించారు. కానీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. తాజాగా చికోటి ప్రవీణ్ ని ఫారం హౌజ్ కి వెళ్లి కలిశారు రాంగోపాల్ వర్మ.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న జంతువులను సందర్శించారు. ఇక్కడ వాతావరణం ఎంతో అహ్లాదంగా ఉందని.. ఆయన సేకరించిన ఎన్నో రకాల జంతువులు తనను బాగా ఆకర్షించాయని.. సోషల్ మీడియా వేధికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయలపై ఒక పొలిటికల్ మూవీ తీయబోతున్నట్లు ప్రకటించారు రాంగోపాల్ వర్మ. గతంలో పలు వివాదాస్పద పొలిటికల్ చిత్రాలు తెరకెక్కించిన విసయం తెలిసిందే. అయితే చికోటి ప్రవీణ్ ని రాంగోపాల్ వర్మ ఎందుకు కలిశారు అన్న విషయం పై రక రకాల చర్చలు నడుస్తున్నాయి.
Sitting with the WILD MAN Chikoti Praveen at his WILD farm house ..His collection of EXOTIC WILD ANIMALS is super IMPRESSIVE 💐 pic.twitter.com/5ylet1MQQF
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022