ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ ధియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రాధే శ్యామ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మొత్తం మూడు నిమిషాల పైనే నిడివి ఉన్న రాధే శ్యామ్ ట్రైలర్లో కథను కొంతమేర రివీల్ చేశారు.
రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవు.. అని ప్రభాస్ ఎవరికో చెప్పిన డైలాగ్ తో రాధే శ్యామ్ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఓ సారి సముద్రంలో షిప్ ను, మరోసారి పొగలు కక్కుతూ వెళ్తున్న ట్రైన్ కనిపిస్తుంది. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అని పూజా హెగ్డే ప్రభాస్ ను ప్రశ్నిస్తుంది. ఐ డోంట్ వాండ్ ఫాల్ ఇన్ లవ్ అని సమాధానం చెబుతాడు ప్రభాస్. కానీ నేను జూలియట్ ని, నాతో ప్రేమలో పడితే చస్తావ్ అని చెబుతుంది పూజా.
అలా విజువల్స్ వెళ్తుండగా.. ఈ రోజు మొత్తం ఎన్ని కిసెస్ అని అడుగుతుంది పూజా హెగ్డే.. 97 అని మెల్లగా చెవిలో చెబుతాడు ప్రభాస్. ప్రపంచం మొత్తం కలవాలనుకునే హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్ ను కృష్ణంరాజు పరిచయం చేస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ విక్రమాదిత్యను కలవడానికి ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడంతో పాటు ప్రభాస్, పూజా హెగ్దేల రొమాన్స్‌ను ఇందులో హైలెట్‌గా చూపించారు. వీరిద్దరూ ప్రేమించుకుంటే ప్రళయం వస్తుందని చూపించడం ద్వారా స్టోరీని కూడా రివీల్ చేశారు.
షిప్ ఉన్న విజువల్స్ టైటానిక్‌ను తలపించాయి. అయితే మొత్తంగా చూస్తే విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్, మేజర్ రవిచంద్రన్, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషించారు. రాధే శ్యామ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. సంక్రాతి పండగ సందర్బంగా 2022 జనవరి 14వ తేదీన రాధే శ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.