టోక్సో– భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కు నిరాశే ఎదురైంది. ఈ సారి ఎలాగైనా టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం సాధించాలనుకున్న సింధు ఆశ అడియాశగానే మిగిలింది. టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరాలనుకున్న షట్లర్ పీ.వీ. సింధూ కల నెరవేరలేదు. చైనాకు చెందిన తైపీ క్రీడాకారిణి తైజూయింగ్ తో జరిగిన సెమీస్‌లో తలపడిన సింధూ వరుస సెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యింది. దీంతో పీవీ సింధుతో పాటు యావత్ భారత దేశం నిరాశ చెందింది.
ఇక టోక్యో ఒలింపిక్స్ లో ఓటమిపై పీవీ సింధు స్పందించింది. బంగారు పతకం గెలుచుకునే అవకాశం చేజారినందుకు విచారంగా ఉందని చెప్పుకొచ్చింది. ఐతే కాంస్య పతకం గెలుచుకుంటానన్న నమ్మకం తనకుందని పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. ఆ మేరకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పింది సంధు.
సింధు ఏమందంటే.. సెమీ ఫైనల్స్‌లో ఒడినందుకు విచారంగా ఉంది.. అయితే.. ఈ మ్యాచ్‌లో నా శక్తినంతా ధారపోశా.. చివరి వరకూ పోరాడా.. కానీ ఈ రోజు నాది కాకుండా పోయింది.. తైజూయింగ్‌ను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా.. కానీ..సెమీస్ స్థాయి మ్యాచ్‌లో పాయింట్లు గెలవడం అంత సులభం కాదు.. పతకం గెలుచుకునే అవకాశం ఇంకా ఉంది.. దానిపైనే దృష్టి పెడతా.. అని చెప్పింది. మనం కూడా పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో కాస్య పధకం సాధించాలని కోరుకుందాం.