ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూరల్ చిన గదిలి గ్రామంలో రెండెకరాలు భూమి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. చిన గదిలిలోని కేటాయించిన భూమిని పశు సంవర్ధక శాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయిస్తూ అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ స్ధలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు – సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అకాడమీని రెండు ఫేజుల్లో నిర్మించనున్నట్టు ప్రభుత్వానికి తెలిపిన పీవీ సింధు – ఒక్కో దశలో రూ. 5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. అకాడమీ అవసరాల కోసమే ఆ భూమి ఉపయోగించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. వాణిజ్య అవసరాల కోసం వాడకూడదని ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది. సింధు ఒలింపిక్స్ సన్నాహల్లో ఉంది. ఇప్పుడు ఆమె దృష్టంతా ఆగస్టులో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌పైనే ఉంది. ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో కఠోరంగా శ్రమిస్తున్నది.
ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. 2016 లో జరిగిన రియో ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిందన్న సంగతి తెలిసిందే.