ఫిల్మ్ డెస్క్- గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి ఏకంగా హాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అమెరికాకు షిఫ్ట్ అయిపోయింది. ఇక తనకు, తన భర్తకు సంబందించిన విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ప్రియాంక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్న ప్రియాంక చోప్రా, తాజాగా ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి వచ్చిన ఆలోచన అంటూ ముఖ్యమైన విషయాన్ని చెప్పింది.
2019 నవంబరులో ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి ప్రియాంక చోప్రాకు ఓ ఆలోచన వచ్చిందట. సాధారనంగా హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు వస్తుంటాయి. కానీ హీరోయిన్లతో మల్టీస్టారర్ తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రియాంకకు వచ్చింది. ముగ్గురు హీరోయిన్లతో మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందనే థాట్ మైండ్‌లో మెదలగానే, వెంటనే ఫోన్ తీసుకొని తన స్నేహితులు కత్రినా కైఫ్, ఆలియాలకు కాల్ చేసి విషయం చెప్పేసిందట.
ఇంకేముంది ప్రియాంక ప్రపోజల్ కు వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారీ లేడీ మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్దమైందన్నమాట. ఈ భారీ లేడీ మల్టీస్టారర్ సినిమా ‘జీలే జరా’ పేరుతో తెరకెక్కనుంది. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారని ప్రియాంక చోప్రా తెలిపింది.
ఈ మల్టీ స్టారర్ సినిమాను 2020 ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి తీసుకురావాలనుకున్నారట, కానీ కరోనా పరిస్థితుల నేపధ్యంలో వాయిదా వేశారని, వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రియాంక చెప్పుకొచ్చింది. మరి ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్.. ఈ ముగ్గురు అందగత్తెలు కలిసిన నటిస్తున్న సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి కదా. అన్నట్లు ఈ సినిమాలో సోనూసూద్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారట.