ఫిల్మ్ డెస్క్- పూజా హెగ్డే.. ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డేకు సక్సెస్ వరించింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ భామ.
పూజా సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్‌లు అంతంత మాత్రంగానే సాగుతుండటంతో పూడా హెగ్డే సోషల్ మీడియా ద్వార ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోకి వస్తోంది.
ఈ మధ్య సోషల్ మీడియాలో పూజా హెగ్డే తెగ హీట్ పుట్టిస్తోంది. మినీ డ్రెస్సులు, హాట్ పిక్స్ తో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. మొన్న లియోటార్డ్ లవ్ అంటూ హాట్ భంగిమల్లో ఫోటోలు పోస్ట్ చేసి కిర్రెక్కించిన ఈ భామ, తాజాగా మరోసారి అదే రేంజ్‌లో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. చూపించకూడని అందాలను చూపిస్తూ అభిమానుకు కనువిందు చేసింది.
మనలో ఉండే మ్యాజిక్‌ని నమ్ముకోవాలి అంటూ ఈ హాట్ పోటోకు క్యాప్షన్ కూడా పెట్టింది నెరజాన. పూజ హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నట్లు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తోంది పూజా హెగ్డే. మరి కొన్ని సినిమాలు కధా చర్చల్లో ఉన్నాయట.
Believe in your own magic 🪄 🖤🤍 pic.twitter.com/sIBFi1bMn3
— Pooja Hegde (@hegdepooja) July 11, 2021