మనలో చాలా మందికి కుక్కలు అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందైతే వాటిని తమ బిడ్డల్లానే చూసుకుంటూ పెంచుతుంటారు. వాటితోనే కలసి తింటారు. కలసి నిద్రపోతారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నిజానికి కుక్కలను పెంచుకోవడం అంత సులభమైన పని కాదు. ఒక్కొక్కసారి అవి చేసే అల్లరికి హద్దు అంటూ ఉండదు. కానీ.., ఇక్కడ ఓ కుక్క మాత్రం యజమాని బంగారు చైన్ ని తినేసింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., కర్ణాటకలోని కర్ణాటకలోని కొప్పళ జిల్లా, కారటిగి పట్టణంలో దిలీప్ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. ఇంటికి కాపలాగా ఉంటుంది కదా అని అతను ఓ కుక్క పిల్లని పెంచుకుంటున్నాడు. ఇక ఈ నెల 12వ తేదీన దిలీప్ నిద్రపోయే ముందు తన మెడలో ఉన్న తన బంగారు గొలుసు తీసి ప్రక్కన పెట్టాడు. ప్రతిరోజు అది అతనకి అలవాటే. కానీ.., ఉదయం లేచే సరికి దిలీప్ కి షాక్ తప్పలేదు.
బంగారు గొలుసు కనిపించక పోవడంతో ఇల్లంతా వెతికాడు దిలీప్. కానీ.., ఎక్కడా కనిపించలేదు. అయితే.., కుక్క ఉన్న స్థలంలో తన బంగారు గొలుసు ముక్కలు పడి ఉండటాన్ని దిలీప్ గమనించాడు. తన గోల్డ్ చైన్ ని.., తన పెంపుడు కుక్కే నమిలి మింగేసిందన్న విషయం అతనికి అర్ధం అయ్యింది. వెంటనే కుక్కను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. కుక్కను పరీక్షించిన డాక్టర్ అవన్నీ చాలా చిన్న చిన్న ముక్కలు అయిపోయాయని, ఆపరేషన్ చేయడానికి నిరాకరించాడు. పైగా.., ఆపరేషన్ కి కూడా భారీ మొత్తంలో డబ్బు అవసరం అవ్వడంతో ఇక చేసేది లేక దిలీప్ కామ్ అయిపోయాడు. ఇక ఆ కుక్కని ఇంటికి తీసుకొచ్చాక అసలు చిత్రం చోటు చేసుకుంది. మరుసటి నాడు కుక్క మల విసర్జన చేయడంతో అందులో నాలుగైదు బంగారు ముక్కలు బయట పడ్డాయి. ఇంకా కూడా కుక్క కడుపులోనే చాలా ముక్కలు ఉండిపోయాయి. అవి బయటపడతాయని తానే ఆ కుక్కకు కాపలా ఉంటున్నాడు దిలీప్. దీంతో.., ఇంటి కాపలా కోసం రూ.5 వేలు పెట్టి కొన్న కుక్కకి.. ఇప్పుడు ఆ ఇంటి యజమానే కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.