ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది ఔత్సాహికుల ప్రతిభ మన కళ్లముందు ఆవిష్కరించబడుతుంది. ఎక్కడ కొత్తదనం కనిపించినా, ఎక్కడ వింతలు, విడ్డూరాలు చోటుచేసుకున్నా నిమిషాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. ఎంతో మంది తమ టాలెంట్ తో అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు.
ఓ పల్లెటూరి కుర్రాడు చేసిన సైకిల్ విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజంగా ఆ కుర్రాడి సాహసం చూస్తుంటై ఔరా అనిపిస్తుంది. ఈ వీడియో ఎక్కడ తీశారో కానీ.. ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. గ్రామాల్లో గడ్డిమోపును నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటారు.. కానీ ఓ కుర్రాడు మాత్రం నెత్తిపై గడ్డిమోపు పెట్టుకొని సైకిల్ హ్యాండిల్ పట్టుకోకుండా వెళ్తు అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా కరెక్ట్ గా రోడ్డు పై ఎమాత్రం బెరుకు లేకుండా జాగ్రత్తగా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.
సైకిల్ ని హ్యాండిల్ పట్టుకోకుండా నడపడం కష్టం.. కానీ ఆ కుర్రాడు ఏకంగా పెద్ద గడ్డిమోపు నెత్తిన పెట్టుకొని హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ పై రివ్వున వెళ్లడం వెనుక నుంచి ఓ వాహనంలోని వారు దీన్ని తమ ఫోన్లో వీడియోగా చిత్రీకరించింది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ కామెంట్స్ వస్తున్నాయి.
Life is beautiful, conditions apply 😅 pic.twitter.com/N5PTxvXgKr
— Prafull MBA CHAI WALA (@Prafull_mbachai) March 28, 2022