డబ్బుకు లోకం దాసోహం.. డబ్బు కోసం ఈ మద్య కొంత మంది ఏ పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్ళు ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. అక్రమ దందాలతో డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్దపడుతున్నారు. ఈజీగా సంపాదించే మార్గాలను ఎంచుకుంటున్నారు.. స్మగ్లింగ్, చైన్ స్నాచింగ్స్, అక్రమ దందాలకు పాల్పపడుతున్నారు. ఇక విదేశాల నుంచి ప్రతిరోజూ ఎక్కడో అక్కడ బంగారం, వజ్రాలు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కోడ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. బంగారు కడ్డీలు అక్రమ రవాణా చేస్తూ పశ్చిమ బెంగాల్ లోని ఓ మహిళ బీఎస్ఎఫ్ కు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే..
దేశంలో బంగారానికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే చాలా మంది ఇతర దేశాల నుంచి తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేసి భారత్ కి అక్రమంగా తరలిస్తుంటారు. ఎన్ని రకాలుగా స్మగ్లింగ్ చేసినా చివరికి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు చిక్కిపోతుంటారు. కొంతమంది సరిహద్దు దాటిస్తున్న సమయంలో భద్రతా సిబ్బందికి దొరిపోతుంటారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కి ఓ మహిళ బంగారు కడ్డీలు స్మగ్లింగ్ చేస్తూ పట్టబడింది. 2 కేజీల బరువు వరకు ఉన్న 27 బంగారు కడ్డీలను మహిళ అక్రమంగా తరలిస్తూ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ కి చిక్కింది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు చెందిన ఓ మహిళ నడుముకు 27 బంగారు కడియాలను చుట్టుకొని పై నుంచి దుస్తులు కప్పుకొని భారత్ కు చేరుకుంది.
ఈ క్రమంలో బంగారం తీసుకొని ఓ స్మగ్లర్ సరిహద్దు దాటిందని బీఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పశ్చిమ బెంగాల్ లో పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహిళల వద్ద బంగారం ఉన్నట్లుగా గుర్తించారు. కాగా, బెంగాల్ లోని ఓ గుర్తు తెలియని వ్యక్తికి బంగారం అప్పజెప్పాలని తనకు ఆదేశాలు ఇచ్చారని.. ఇందుకోసం తనకు రూ.2 వేలు ఇస్తారని మహిళ వెల్లడించింది. ఈ బంగారం కడ్డీల విలువ రూ.1.29 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకొని.. బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.