woman mp : బీజేపీ ఎంపీ రూపా గంగూలీ రాజ్యసభలో కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం రాజ్య సభ సమావేశాల్లో బిర్‌భూమ్ ఘటనపై ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఇక ఏమాత్రం నివాస యోగ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. బిర్‌భూమ్ నరమేధం కారణంగా చాలా మంది రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్, బిర్‌భూమ్‌లోని బోగ్‌తుయ్ గ్రామంలో ఓ టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగా అతడి అనుచరులు దారుణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఇంతకీ ఏం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లా బీర్‌భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లో ప్రాంతంలో టీఎంసీకి చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ నేత భదుషేక్ సోమవారం రాత్రి 8.30కు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వెంటనే భదు షేక్ వర్గీయులు బర్షాల్ గ్రామంలో దాదాపు 12 ఇళ్లకు తలుపు బిగించి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని మొత్తం ఎనిమిది మృతి చెందారు.
నిన్న (గురువారం) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఉదయం కోల్‌కతా హైకోర్టు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి : స్కూలు బస్సులో బీరు తాగుతూ విద్యార్థినిల హల్చల్.. వీడియో వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.